హార్లీ డేవిడ్ సన్ X440 VS ట్రియంప్ స్పీడ్ 400: ఈ రెండు బైక్‌లలో ఏది బెటర్?
ట్రియంప్ మోటార్ సైకిల్స్ నుంచి స్పీడ్ 400 బైక్, ఇండియా మార్కెట్‌లో విడుదలవుతోంది. ఈ బైక్‌ను జులై 5న ట్రియంప్ మోటార్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ట్రియంప్ కన్నా ముందుగానే జులై 3న హార్లీ డేవిడ్ సన్ X440 బైక్ విడుదల కానుంది. దీంతో ఈ రెండు బైకుల మధ్య తేడాలను తెలుసుకుందాం. హార్లీ డేవిడ్ సన్ X440ఫీఛర్లు: పెద్దగా ఉండే ఇంధన ట్యాంక్ ఎల్ఈడీ హెడ్ లైట్ పెద్ద హ్యాండిల్ బార్ స్టెప్ అప్ సీట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ అలాయ్ వీల్స్ ట్రియంప్ స్పీడ్ 400ఫీఛర్లు: చెక్కినట్టుగా ఉండే ఇంధన ట్యాంక్ గుండ్రంగా ఉండే హెడ్ లైట్ పెద్ద హ్యాండిల్ బార్ 17అంగుళాల అలాయ్ వీల్స్ సింగిల్ సీట్
హార్లీ డేవిడ్ సన్ X440, ట్రియంప్ స్పీడ్ 400 మధ్య తేడాలు
ఈ రెండు బైకుల ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్ ఉంది. అలాగే డ్యుయల్ ఏబీఎస్ ఛానల్ ఉంది. 440సీసీతో పాటు సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ సిస్టమ్‌ను హార్లీ డేవిడ్ సన్ కలిగి ఉంది. గరిష్టంగా 40hp పవర్‌ను ఉపయోగించే సామర్థ్యం ఉంది. ఇక ట్రియంప్ స్పీడ్ 400 విషయానికి వస్తే, 398సీసీతో లిక్విడ్ కూల్ సిస్టమ్ కలిగి ఉండి 39.4hp పవర్‌ను ఉపయోగించే సామర్థ్యం ఉంది. దీనిలో 6స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ధరలు: ఇండియాలో ట్రియంప్ స్పీడ్ 400 ధర, 2.25లక్షలుగా(ఎక్స్ షోరూమ్) ఉండనుంది. హార్లీ డేవిడ్ సన్ విషయానికి వస్తే, 2.5లక్షలుగా(ఎక్స్ షోరూమ్) ఉంది.