యువ రైడర్లను ఆకట్టుకొనే హార్లే డేవిడ్ సన్ X440 వచ్చేసింది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హార్లే డేవిడ్ సన్ X440 బైక్ వచ్చేసింది. ఇండియన్ మార్కెట్లోకి ఈ బైక్ ను జూన్ 3న లాంచ్ చేయనున్నారు. ఈ బైక్ కోసం ముందుగా రూ.25వేలు డిపాజిట్ చేసి డీలర్ షిప్‌ల వద్ద బుక్ చేసుకొనే అవకాశం ఉంది. ప్రముఖ హార్లే మేడ్ ఇన్ ఇండియా నుంచి ఈ బైక్ రానుంది. హీరో మోటోకార్ప్ తో హార్లే డేవిడ్ సన్ తయారీ భాగస్వామ్యంతో రానున్న మొదటి మోటర్ సైకిల్ ఇది. సింగిల్ సిలిండర్ 440cc మోటరుతో వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. X440 మోటర్ సైకిల్ 8,000rpm రెడ్ లైన్ కలిగి ఉంటుందని గత లీకులు వెల్లడించాయి
హార్లి డేవిడ్ సన్ ధర ఎంతంటే?
ఈ బైక్ సూమారు 38bhp గరిష్ట శక్తిని, 30Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. ముందువైపు బ్రేకింగ్ ఫోర్స్ బైబ్రీ కాలిపర్లతో ముందు బ్రేకులు సూమారు 320mm, 230mm వెనుక డిస్క్ గా ఉన్నట్లు ఐబాల్ అంచనా వేసింది. ముఖ్యంగా డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్ట్ గా వస్తోంది. ఈ బైక్ జూలై 3న సేల్‌కు రెడీగా ఉంది. కొత్త బజాజ్ ట్రయంఫ్ స్క్రాంబ్లర్, రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 వంటి వాటితో ఈ బైక్ పోటీ పడనుంది. ఈ బైక్ ధర రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల మధ్య ఉండనుంది.