Loading...
Kawasaki Ninja 650: కవాసకి నింజా 650 కొత్త మోడల్ వచ్చేసింది.. 68hp ఇంజిన్‌తో కొత్త ఫీచర్లు ఇవే!
కవాసకి నింజా 650 కొత్త మోడల్ వచ్చేసింది.. 68hp ఇంజిన్‌తో కొత్త ఫీచర్లు ఇవే!

Kawasaki Ninja 650: కవాసకి నింజా 650 కొత్త మోడల్ వచ్చేసింది.. 68hp ఇంజిన్‌తో కొత్త ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

కవాసకి తన పాపులర్ స్పోర్ట్స్ బైక్ Ninja 650కు 2027 మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. తొలుత ఈ కొత్త వెర్షన్‌ను యూకే మార్కెట్‌లో పరిచయం చేసింది. గత మోడల్‌తో పోలిస్తే 2027 Ninja 650లో పలు కీలక మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో పాటు కొత్త కలర్ ఆప్షన్లను అందించింది. ఈ కొత్త మోడల్‌లో ముఖ్యంగా బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ సస్పెన్షన్‌లో కీలక మార్పులు చేశారు. దీంతో రోడ్డుపై బైక్ పనితీరు, కార్నరింగ్ సమయంలో స్టెబిలిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

వివరాలు

కొత్త 4-పిస్టన్ బ్రేక్ కాలిపర్లు

2027 Ninja 650లో బ్రేకింగ్ సిస్టమ్‌ను కవాసకి గణనీయంగా అప్‌గ్రేడ్ చేసింది.

గత మోడల్‌లో ఉన్న యాక్సియల్-మౌంటెడ్ 2-పిస్టన్ కాలిపర్ల స్థానంలో కొత్త బైక్‌లో రేడియల్‌గా మౌంట్ చేసిన 4-పిస్టన్ కాలిపర్లను అందించింది.

ఈ మార్పుతో బ్రేకింగ్ పనితీరు మెరుగుపడటంతో పాటు బ్రేక్ వేస్తున్న సమయంలో రైడర్‌కు లభించే ఫీడ్‌బ్యాక్ కూడా మెరుగయ్యే అవకాశం ఉంది.

వివరాలు

కొత్త USD ఫ్రంట్ ఫోర్క్

ఫ్రంట్ సస్పెన్షన్‌లోనూ కీలకమైన అప్‌గ్రేడ్ చేసింది.

మునుపటి Ninja 650లో ఉన్న 41mm కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్ స్థానంలో 2027 మోడల్‌లో 37mm Separate Function Upside-Down (USD) ఫోర్క్‌ను అమర్చింది.

ఈ కొత్త సస్పెన్షన్ సెటప్ కార్నరింగ్ సమయంలో బైక్‌కు మెరుగైన స్టెబిలిటీ, రైడింగ్ ఫీల్ అందించేందుకు ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

వివరాలు

కొత్త TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

మెకానికల్ మార్పులతో పాటు ఫీచర్ల పరంగా కూడా 2027 Ninja 650లో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో కొత్త 4.3-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. అలాగే బైక్‌ను రెండు కొత్త కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. అవి Matte Grey, Lime Green.

అదే ఇంజిన్.. 68hp పవర్

ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త Ninja 650లో మునుపటి మోడల్‌లో ఉన్న లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించారు.

ఈ ఇంజిన్ 68hp పవర్, 64Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

యూకేలో ధర ఎంతంటే?

కవాసకి 2027 Ninja 650 ధరను యూకే మార్కెట్‌లో £7,499గా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.8.16 లక్షలు . ముఖ్యంగా మునుపటి మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్షన్ ధరలో ఎలాంటి పెంపు చేయలేదు.

ఇండియాలో ఎప్పుడు విడుదల?

2027 Kawasaki Ninja 650 భారత మార్కెట్‌లో ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు.

అయితే యూకేలో అనుసరించిన ధరల వ్యూహాన్నే భారత్‌లోనూ కవాసకి పాటిస్తే.. పెద్దగా ధర పెంపు లేకుండానే ఈ కొత్త Ninja 650 దేశీయ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT