Tata Curvv: వావ్ అనిపిస్తున్న కొత్త టాటా కర్వ్ డిజైన్.. ధర ఎంతంటే?
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టాటా కర్వ్‌ను తీసుకురానుంది. ఇది హ్యుందాయ్ కెట్రా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియో సెల్టోస్ వంటి వాటికి Curvv టాటా మోటార్స్ సమాధానంగా ఉంటుంది. 2024లో భారత్ మార్కెట్లో Curvv లాంచ్ కానుంది. టాటా ఇప్పటికే ఒక బలమైన ఎస్యూవీ పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. ఇందులో పంచ్, నెక్సాన్, హారియర్, సఫారి ఉన్నాయి. Curvv పూర్తిగా కొత్త డిజైన్‌తో వావ్ అనిపిస్తోంది. ముందు, వెనుక LED లైటింగ్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, స్పోర్టీ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, పొడవైన బూట్ సెక్షన్, ఎడ్జీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
Curvv ICE మోడల్ ధర రూ. 10.50 లక్షలు
ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. Curvv టచ్-సెన్సిటివ్ HVAC ప్యానెల్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటో-డిమ్మింగ్ IRVMలు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా పొందుతుంది. SUV కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో ఇల్యూమినేటెడ్ టాటా లోగోను కలిగి ఉంటుంది. Curvvలో సెఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360° సరౌండ్ వ్యూ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉంటాయి. ఇది 500 కి.మీ రేంజ్‌ను కలిగి ఉంది. Curvv ICE మోడల్ ధర రూ. 10.50 లక్షలు ఉండనుంది.