
Hyundai Venue : ఫ్యామిలీ ఎస్‌యూవీలలో నెక్స్ట్ లెవెల్.. కొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రత్యేకతలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'హ్యుందాయ్' తన అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్-సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ వెన్యూను నెక్ట్స్ జనరేషన్ మోడల్‌గా భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. పలు మీడియా నివేదికల ప్రకారం 2025 హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 4న మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో ఒకటైన వెన్యూ సిరీస్‌కు ఇది పెద్ద అప్‌డేట్ కానుంది. అంతేకాక కొత్త వెన్యూ N లైన్ మోడల్ కూడా ఈ విడుదల తర్వాత త్వరలోనే మార్కెట్లోకి రానుందని సమాచారం.
Details
కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ - డిజైన్ మార్పులు
నివేదికల ప్రకారం, నెక్ట్స్ జనరేషన్ వెన్యూ పూర్తిగా రీడిజైన్ అవుతుంది. ఇది మరింత ఆధునిక, స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది. కొత్త ముందు, వెనుక బంపర్‌లు నిలువుగా అమర్చిన ప్రొజెక్టర్ యూనిట్లతో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ దీర్ఘచతురస్రాకార గ్రిల్ * కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ అప్డేట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్ ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ లైట్‌తో కూడిన స్పోర్టీ రియర్ స్పాయిలర్ ఇవి కొత్త వెన్యూకి ప్రధాన ఎక్స్‌టీరియర్ అట్రాక్షన్స్‌గా నిలుస్తాయి.
Details
2025 హ్యుందాయ్ వెన్యూ - ఫీచర్స్ (అంచనా)
క్యాబిన్ డిజైన్‌లో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. కొత్త కర్వ్‌డ్ డిస్‌ప్లే డాష్‌బోర్డ్‌పై ప్రధాన ఆకర్షణ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలర్‌తో కూడిన పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సరికొత్త ఎయిర్ వెంట్స్ రీడిజైన్ చేసిన మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ కొత్త సెంటర్ కన్సోల్ డాష్‌బోర్డ్‌పై అమర్చిన స్పీకర్ అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ప్రీమియం ఫీచర్లు వెన్యూ ఆకర్షణను మరింత పెంచుతాయి.
Details
2025 హ్యుందాయ్ వెన్యూ - ఇంజిన్ ఆప్షన్స్
కంపెనీ అధికారిక ఇంజిన్ వివరాలు వెల్లడించకపోయినా, ప్రస్తుత వెన్యూ మోడల్‌లో ఉన్న ఇంజిన్ ఆప్షన్స్ కొనసాగే అవకాశం ఉందని అంచనా. అవి: 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ 1.5-లీటర్ డీజిల్ యూనిట్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు: 5-స్పీడ్ మాన్యువల్ 6-స్పీడ్ మాన్యువల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT)
Details
మార్కెట్‌లో పోటీ
కొత్త వెన్యూ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఉన్న శక్తివంతమైన ప్రత్యర్థులు - మారుతీ సుజుకీ బ్రెజా, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్, స్కోడా కైలాక్, నిస్సాన్ మాగ్నైట్ -లకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారతదేశంలో పెరుగుతున్న పోటీ పరిస్థితుల్లో, డిజైన్ ఆవిష్కరణలు మరియు టెక్నాలజీ అభివృద్ధిపై హ్యుందాయ్ నిరంతర దృష్టిని ఈ కొత్త వెన్యూ మోడల్ మరింత స్పష్టంగా చూపిస్తోంది.