
జనవరి 1 నుంచి 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్' బైక్ ధరలు పెరుగుతున్నాయ్!
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ల అమ్మకాలు నవంబర్‌లో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ బైక్ ధరలను పెంచేందుకు కంపెనీ సిద్ధమైంది.
బైక్ రీలాంచ్ అయిన తర్వాత మొదటి సారిగా జనవరి 1 నుంచి ఈ బైక్ ధరలను కంపెనీ పెంచనుంది.
డిసెంబర్ 31లోపు బుక్ చేసుకునే వారికి పాత ధరల్లోనే లభించనుంది. ఆ తర్వాత మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.
జనవరి 1 తర్వాత Royal Enfield Himalayan adventure ధర గణనీయంగా పెరుగుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
బైక్
రంగును మార్చడం వల్ల ధరపై ప్రభావం
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బేస్ మోడల్ ధర రూ. 2.69 లక్షలు ఉంది. హాన్లే బ్లాక్ కలర్‌తో రేంజ్-టాపింగ్ సమ్మిట్ ట్రిమ్ (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) రూ.2.84 లక్షలు ఉంది.
కస్టమర్ జనవరి 1 కంటే ముందు Royal Enfield Himalayan adventure బైక్‌ను బుక్ చేసినట్లయిత.. ఈ తేదీ తర్వాత రంగును మార్చాలని నిర్ణయించుకున్నా.. కూడా పెంచిన ధరను చెల్లించాలని డీలర్లు చెబుతున్నారు.
డిసెంబర్ 31 లోపు బైక్ రంగును మార్చినట్లయితే ఎలాంటి అదనపు భారం ఉండదు.
రాబోయే వారాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ని కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారు 31వ తేదీలోపు కొంటేనే బటర్ అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.