
Mahindra XEV 9E: భారత్ మార్కెట్లో NCAP 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్ ఎలక్ట్రిక్ వాహనాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్తగా ఎలక్ట్రిక్ కార్ కొనాలని యోచిస్తున్నారా? అయితే రేంజ్ మాత్రమే కాకుండా సేఫ్టీ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ నేపథ్యలో భారత్ ఎన్‌సీఏపీ (Bharat NCAP) సేఫ్టీ రేటింగ్‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పర్యావరణ అనుకూలత, సామర్థ్యం మాత్రమే కాకుండా భద్రత ప్రమాణాల్లోనూ కొత్త మైలురాళ్లను చేరుకుంటున్నాయి. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) క్రాష్ సేఫ్టీకి కొత్త ప్రమాణాలను ఏర్పరిచిన తర్వాత, పలు ఎలక్ట్రిక్ కార్లు 5-స్టార్ అత్యున్నత రేటింగ్‌ను సాధించాయి. భద్రత, నూతన ఆవిష్కరణలు, పనితీరు, అత్యుత్తమ Bharat NCAP స్కోర్లు కలిగిన భారతదేశంలోని అగ్రగామి 5 ఎలక్ట్రిక్ వాహనాలు.
Details
1. మహీంద్రా XUV 9E
మహీంద్రా తదుపరి తరం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XUV 9E భద్రతలో చరిత్ర సృష్టించింది. ఇది Bharat NCAP లో 'అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32/32', చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 45/49 స్కోరు సాధించి, పరిపూర్ణ 5-స్టార్ రేటింగ్ పొందింది. దృఢమైన బాడీ నిర్మాణం, బహుళ ఎయిర్‌బ్యాగ్స్ తో అత్యున్నత భద్రతను అందిస్తుంది. ధరలు రూ. 21.90 లక్షల నుంచి 31.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది టాటా హారియర్ ఈవీ, BYD Atto 3 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.
Details
2. మహీంద్రా BE 6
మహీంద్రా BE లైనప్ నుంచి మరొక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BE 6 కూడా 5-స్టార్ రేటింగ్ పొందింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ 31.97/32, COP 45/49 స్కోరును సాధించింది. ఇది గ్లోబల్ క్రాష్ ప్రమాణాల ప్రకారం, అత్యుత్తమ బ్యాటరీ భద్రత కోసం మహీంద్రా INGLO ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. XUV 9Eతో ప్లాట్‌ఫామ్, ఇతర కీలక భాగాలను పంచుకుంటుంది. ధరలు రూ. 18.90 లక్షల నుంచి 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.
Details
4. టాటా పంచ్ ఈవీ
భారతదేశంలో అత్యంత అఫార్డిబుల్ 5-స్టార్ రేటింగ్ పొందిన ఈవీల్లో టాటా పంచ్ ఈవీ ఒకటి. ఇది అడల్ట్ సేఫ్టీ 31.46/32, చైల్డ్ సేఫ్టీ 45/49 స్కోరు సాధించింది. అత్యంత దృఢంగా ఉన్న ఈ కారును Acti.ev ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. నగరంలో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా, కనెక్టెడ్ ఫీచర్లు, అద్భుతమైన భద్రతను అందిస్తుంది. ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Details
5. టాటా నెక్సాన్ ఈవీ
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఈవీ, 5-స్టార్ Bharat NCAP రేటింగ్‌తో భద్రతా వారసత్వాన్ని కొనసాగిస్తోంది. AOP 29.86/32, COP 44.95/49 స్కోరు సాధించింది. దృఢమైన బాడీ షెల్, ఆధునాతన ఎలక్ట్రానిక్ సేఫ్టీ ఎయిడ్స్, మెరుగైన రేంజ్ సామర్థ్యంతో నెక్సాన్ ఈవీ పనితీరు, భద్రతలో గొప్ప సమ్మేళనాన్ని అందిస్తుంది. ధరలు రూ. 12.49 లక్షల నుంచి 17.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.