LOADING...
Top Selling CNG Cars: భారత్‌లో టాప్‌ సేల్‌ అయిన సీఎన్జీ కార్లు ఇవే.. మార్కెట్‌ను ఏలుతున్న మారుతీ సుజుకీ!
భారత్‌లో టాప్‌ సేల్‌ అయిన సీఎన్జీ కార్లు ఇవే.. మార్కెట్‌ను ఏలుతున్న మారుతీ సుజుకీ!

Top Selling CNG Cars: భారత్‌లో టాప్‌ సేల్‌ అయిన సీఎన్జీ కార్లు ఇవే.. మార్కెట్‌ను ఏలుతున్న మారుతీ సుజుకీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో సిఎన్‌జీ కార్లకు డిమాండ్ రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎగబాకుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ప్రయాణం కోసం వినియోగదారులు పెద్ద ఎత్తున సిఎన్‌జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాజా గణాంకాలు దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10సిఎన్‌జీ కార్ల జాబితాను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ జాబితాలో మొదటి స్థానాన్ని మారుతీ సుజుకీ ఎర్టిగా దక్కించుకుంది. FY2026లో ఈ మోడల్ 1,45,480 యూనిట్లు అమ్ముడై 14.3శాతం మార్కెట్ వాటాను సాధించింది. విస్తారమైన అంతర్గత స్థలం, తక్కువ నిర్వహణ ఖర్చులు ఉండటం వల్ల కుటుంబాల కోసం ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. రెండో స్థానంలో మారుతి సుజుకి డిజైర్ నిలిచింది.

వివరాలు

మూడో స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ఈ కారు 1,35,330 యూనిట్లు విక్రయమై 13.3శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ముఖ్యంగా మార్చి 2026లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే కావడం విశేషం. మూడో స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఉంది. 96,381 యూనిట్ల అమ్మకాలతో 9.5 శాతం మార్కెట్ వాటాను పొందింది. సరసమైన ధరలో అందుబాటులో ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. నాలుగో స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా 71,329 యూనిట్లతో నిలిచింది. ఐదో స్థానంలో టాటా నెక్సాన్ 69,168యూనిట్ల అమ్మకాలతో ఉంది. ఆరవ స్థానంలో టాటా పంచ్ 67,468 యూనిట్లు నమోదు చేయగా, ఏడో స్థానంలో మారుతి సుజుకి ఈకో 66,675 యూనిట్లతో నిలిచింది. ఈ జాబితాలో ఉన్న ఏకైక వ్యాన్ ఈకో కావడం గమనార్హం.

వివరాలు

పదో స్థానంలో మారుతీ సుజుకీ సెలెరియో

ఎనిమిదో స్థానంలో హ్యుందాయ్ ఆరా 62,612 యూనిట్లు విక్రయమయ్యాయి. తొమ్మిదో స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ 54,805 యూనిట్లు, పదో స్థానంలో మారుతి సుజుకి సెలెరియో 35,677 యూనిట్లతో చోటు దక్కించుకున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో సిఎన్‌జీ కార్ల మార్కెట్‌పై మారుతీ సుజుకీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. టాప్ 10లో అధిక శాతం మారుతి మోడళ్లే ఉండటం, అలాగే మొత్తం మార్కెట్‌లో సగానికి పైగా వాటా కలిగి ఉండటం దీని ప్రజాదరణను ప్రతిబింబిస్తోంది. అంతేకాదు టాప్ 5లో నాలుగు కార్లు మారుతి సుజుకి సంస్థకే చెందినవిగా ఉండటం ప్రత్యేకంగా నిలిచింది. మొత్తంగా మీరు సిఎన్‌జీ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ జాబితా మీకు సరైన ఎంపిక చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.

Advertisement