Loading...
Jaguar: జాగ్వార్ టైప్ 01 EV ఇంటీరియర్ ఇలా ఉంది.. డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
జాగ్వార్ టైప్ 01 EV ఇంటీరియర్ ఇలా ఉంది.. డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Jaguar: జాగ్వార్ టైప్ 01 EV ఇంటీరియర్ ఇలా ఉంది.. డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ జాగ్వార్ తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనం టైప్ 01 (Type 01) ఇంటీరియర్‌ను ఆవిష్కరించింది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఈ కారు క్యాబిన్‌లో మినిమలిస్ట్ డిజైన్‌ను తీసుకొచ్చింది. జాగ్వార్ ఇప్పటివరకు అనుసరించిన సంప్రదాయ డిజైన్‌కు భిన్నంగా కొత్తగా ఇంటీరియర్‌ను రూపొందించింది. సాధారణంగా కనిపించే వుడ్, క్రోమ్ ఫినిష్‌లకు బదులుగా ఫ్లోయింగ్ సర్ఫేస్‌లు, డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లకు ప్రాధాన్యం ఇచ్చింది. డ్యాష్‌బోర్డ్ నుంచి వెనుక సీట్ల వరకు క్యాబిన్ మధ్యలో ఒక పూర్తి పొడవైన స్పైన్ తరహా నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇంటీరియర్‌ను నాలుగు ప్రత్యేక సీటింగ్ ప్రాంతాలుగా విభజిస్తుంది. దీంతో టైప్ 01లో ప్రత్యేకమైన నాలుగు సీట్ల కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది.

వివరాలు

ట్రావెర్టైన్ రాయి, వోవెన్ టెక్స్‌టైల్స్‌ నుంచి స్ఫూర్తి..

టైప్ 01 ఇంటీరియర్‌లో కారు పొడవును హైలైట్ చేసేలా డిజైన్ చేశారు.

ప్రస్తుతం చాలా కార్లలో కనిపించే సంప్రదాయ హారిజాంటల్ లేఅవుట్‌కు భిన్నంగా ఈ క్యాబిన్‌లో లాంగిట్యూడినల్ డిజైన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

మధ్యలో ఉన్న స్పైన్, డోర్ల పైభాగాల్లో బ్రాస్‌ను పోలిన ఫినిష్‌లను ఉపయోగించారు.

ఇందులో జాగ్వార్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న 'లీపర్' లోగోను కూడా ట్రిమ్‌లో భాగంగా అమర్చారు.

ప్రీమియం లుక్, ఫీల్ కోసం ట్రావెర్టైన్ రాయి, వోవెన్ టెక్స్‌టైల్స్ వంటి మెటీరియల్స్ నుంచి కూడా డిజైన్ స్ఫూర్తి పొందారు.

వివరాలు

కాంపాక్ట్ సెంట్రల్ టచ్‌స్క్రీన్..

టైప్ 01లో డ్రైవర్ కోసం పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను అందించారు.

అయితే మధ్యలో ఉండే టచ్‌స్క్రీన్ మాత్రం పరిమాణంలో కొంత చిన్నగా ఉంటుంది.

ఇది ప్రత్యేకంగా బయటకు పొడుచుకొచ్చినట్లు కాకుండా డ్యాష్‌బోర్డ్ డిజైన్‌లోనే కలిసిపోయేలా ఏర్పాటు చేశారు.

విండ్‌స్క్రీన్ దిగువ భాగంలో కెమెరా ఆధారిత డిజిటల్ ClearSight రియర్ వ్యూ డిస్‌ప్లేను కూడా అందించారు.

ఇది వెనుక వైపు రోడ్డును మధ్య భాగంలో చూపిస్తుంది. దీని వ్యూ యాంగిల్‌ను బయట ఉన్న రియర్ వ్యూ మిర్రర్ల ఎత్తుకు అనుగుణంగా రూపొందించారు.

ఇంటీరియర్ డిజైన్‌లో భాగంగా దాచిన స్టోరేజ్ ప్రాంతాలు, కనిపించకుండా అమర్చిన టెక్నాలజీ ఫీచర్లను కూడా అందించారు. దీంతో క్యాబిన్ మరింత క్లీన్‌గా, ఆధునికంగా కనిపిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

ప్రత్యేకంగా రూపొందించిన సీట్లు..

టైప్ 01 స్టీరింగ్ వీల్‌లో రెండు-స్పోక్ డిజైన్‌ను ఉపయోగించారు. ఇందులో హ్యాప్టిక్ టచ్ కంట్రోల్స్ ఉంటాయి.

అదే సమయంలో సాధారణ కాలమ్ స్టాక్స్‌ను కూడా కొనసాగించారు.

డ్రైవింగ్ సమయంలో ప్రత్యేక అనుభూతి కలిగించేలా సీటింగ్ పొజిషన్‌ను తక్కువ ఎత్తులో ఉంచారు.

దీన్ని జాగ్వార్ GT డ్రైవింగ్ పొజిషన్గా పేర్కొంటోంది. ముందు, వెనుక సీట్లను కూడా ప్రత్యేకంగా శిల్పంలా ఆకృతీకరించారు.

ఎక్కువ ప్లీట్స్ లేదా అలంకరణలు లేకుండా సింపుల్ డిజైన్‌ను ఎంచుకున్నారు.

దీంతో టైప్ 01 క్యాబిన్ మొత్తం సింపుల్, ప్రీమియం, క్లీన్ లుక్‌ను కలిగి ఉంటుంది.

ADVERTISEMENT