LOADING...
Toyota: టయోటా ఆవిష్కరిస్తున్న ల్యాండ్‌ క్రూయిజర్ ఎఫ్‌జే ఇదే.. రగ్గడ్ లుక్‌తో ముందుకు!
టయోటా ఆవిష్కరిస్తున్న ల్యాండ్‌ క్రూయిజర్ ఎఫ్‌జే ఇదే.. రగ్గడ్ లుక్‌తో ముందుకు!

Toyota: టయోటా ఆవిష్కరిస్తున్న ల్యాండ్‌ క్రూయిజర్ ఎఫ్‌జే ఇదే.. రగ్గడ్ లుక్‌తో ముందుకు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మక 'ల్యాండ్‌ క్రూయిజర్' శ్రేణిలో 'ఎఫ్‌జే' అనే కొత్త కాంపాక్ట్ ఆఫ్‌రోడర్‌ను ఆవిష్కరించింది. హెరిటేజ్ డిజైన్, ఆధునిక భద్రతా ఫీచర్లు, నిరూపితమైన ఆఫ్‌రోడ్ సామర్థ్యాన్ని కలిగిన ఈ వాహనం జపాన్‌లో 2026 మధ్యలో విడుదల కానుంది. ల్యాండ్‌ క్రూయిజర్ కుటుంబంలోని 300 సిరీస్, 70 సిరీస్, 250 సిరీస్‌లతో పాటు ఇప్పుడు ఎఫ్‌జే కూడా చేరుతుంది. ఇది కాంపాక్ట్, యూత్‌ఫుల్‌గా రూపొందించారు. కస్టమర్ బేస్‌ను మరింత విస్తరించడానికి అనుకూలంగా ఉంది.

Details

70 ఏళ్ల వారసత్వం, ఫ్రీడమ్ & జాయ్

1951లో ప్రారంభమైన ల్యాండ్‌ క్రూయిజర్, ఫుజి పర్వతంలోని ఆరో స్టేషన్ వరకు ఎక్కిన తొలి వాహనంగా చరిత్ర సృష్టించింది.' 70 ఏళ్ల చరిత్రలో 190 దేశాల్లో 12 మిలియన్లకు పైగా యూనిట్లు విక్రయించిన ఈ వాహనం, విశ్వసనీయత, మన్నిక, ఆఫ్‌రోడ్ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. ఎఫ్‌జే దీన్ని కొనసాగిస్తూ ఫ్రీడమ్ & జాయ్ అనుభవాన్ని అందిస్తుంది.

Details

 డిజైన్ హైలైట్స్: పాతదనం & కొత్తదనం కలయిక 

రగ్గడ్ లుక్ : బాక్సీ, దీర్ఘచతురస్రాకార సిల్హౌట్, రూమీ క్యాబిన్, దృఢమైన స్టాన్స్. హెరిటేజ్ టచ్ : గుండ్రటి హెడ్‌లైట్లు పాత తరం మోడళ్ల గుర్తును తెస్తాయి. మౌంటింగ్ ప్యానెల్స్: MOLLE ప్యానెల్స్ బాహ్య గేర్ అమర్చడానికి. సులభమైన రిపేర్ : కార్నర్ బంపర్‌లను తొలగించగలిగే, మార్చగలిగే డిజైన్, పర్సనలైజేషన్‌కు వీలు. ఇంటీరియర్ & కంట్రోల్ డ్రైవర్‌కుVisibility & Control ప్రధానంగా. క్షితిజ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వాహన పొజిషన్ అంచనా వేయడానికి. తక్కువ బెల్ట్‌లైన్, తగ్గిన Hood Area, కఠిన భూభాగాలపై స్పష్టమైన దృశ్యమానత. టయోటా సేఫ్టీ సెన్స్ : ప్రీ-కొలిజన్ సేఫ్టీ, అధునాతన భద్రతా వ్యవస్థలు. ఆఫ్‌రోడ్ సామర్థ్యం మంచి గ్రౌండ్ క్లియరెన్స్,వీల్ ఆర్టిక్యులేషన్. ఎఫ్‌జే ల్యాండ్‌ క్రూయిజర్ విశ్వసనీయత, ఆఫ్‌రోడ్ సామర్థ్యంలో విశేషం.

Details

పవర్‌ట్రైన్ & ఇంజన్ 

2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ (2TR-FE)**: 163 bhp శక్తి, 246 Nm టార్క్. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, **పార్ట్-టైమ్ 4WD. 250 సిరీస్‌తో పోలిస్తే చిన్న వీల్‌బేస్ (2,580 mm), 5.5 m టర్నింగ్ రేడియస్, మెరుగైన మ్యానువరబిలిటీ.