
Electric scooter : ఈ స్కూటర్‌కి లైసెన్స్ అవసరమే లేదు.. ధర మాత్రం 49 వేలు మాత్రమే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఎలక్ట్రిక్ 2 వీలర్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. రోజుకో కొత్త ప్రాడక్ట్ అందుబాటులోకి వస్తుండటంతో వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలకూ సరిపోయే ఎంపికలు పెరిగిపోతున్నాయి.
అలాంటి వాటిలో తాజాగా మార్కెట్లోకి వచ్చిన మరో మోడల్ పేరు 'జెలియో లిటిల్ గ్రేసీ'. ఇది ఒక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముఖ్యంగా యువ రైడర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.దీనికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!
జెలియో లిటిల్ గ్రేసీని ఓ స్టార్టప్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ప్రారంభ ధరగా రూ.49,500గా నిర్ణయించింది.
ఇది నాన్ ఆర్టీఓ వాహనం కావడంతో, నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు.
10 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువత కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.
Details
మూడు వేరియంట్లు.. మూడు రేంజ్ ఆప్షన్లు
జెలియో లిటిల్ గ్రేసీ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటన్నింటికీ 80 కిలోల బరువుతో వచ్చే 48/60V BLDC మోటార్ ఉంది. గరిష్టంగా 150 కిలోల లోడ్ మోయగలదు.
టాప్ స్పీడ్ మాత్రం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. చార్జింగ్‌కి 1.5 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందని కంపెనీ తెలిపింది.
48V / 32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ - 55-60 కిలోమీటర్ల రేంజ్
60V / 32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ - 70 కిలోమీటర్ల రేంజ్, ఛార్జింగ్ సమయం 7-9 గంటలు
60V / 30Ah లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్ - 70-75 కిలోమీటర్ల రేంజ్, ఛార్జింగ్ సమయం 8-9 గంటలు
Details
ఆధునిక ఫీచర్లు
లిటిల్ గ్రేసీ స్కూటర్‌లో డిజిటల్ మీటర్, యూఎస్‌బీ పోర్ట్, కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంటర్ లాక్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
హార్డ్‌వేర్ విషయంలో కూడా కాంప్రమైజ్ లేదు
లిటిల్ గ్రేసీ ముందు, వెనుక చక్రాలలో హైడ్రాలిక్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్‌లు ఉండటం విశేషం. ఈ ఫీచర్లు స్కూటర్‌కి రైడింగ్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
ధరలు - వేరియంట్‌ల వారీగా
48V / 32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ - రూ. 49,500
60V / 32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ - రూ. 52,000
60V /30Ah లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్ - రూ. 58,000
Details
అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్స్
ఈ స్కూటర్ పింక్, బ్రౌన్ అండ్ క్రీమ్, వైట్ అండ్ బ్లూ, యెల్లో అండ్ గ్రీన్ వంటి నాలుగు డ్యూయల్-టోన్ కలర్ కాంబినేషన్లలో లభిస్తుంది.
ఈ మోడల్‌తో పాటు జెలియో సంస్థ ఇతర ఈవీ ప్రాడక్ట్స్ కూడా అందుబాటులో ఉంచింది.
మరిన్ని వివరాల కోసం మీ సమీప డీలర్‌షిప్ షోరూమ్‌ను సంప్రదించవచ్చు. అలాగే టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకోవచ్చు.