LOADING...
Top 5 EVs: దేశంలో టాప్‌-5 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ప్రకటన.. ఓలా ఎలక్ట్రిక్ ఎక్కడ నిలిచింది?
దేశంలో టాప్‌-5 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ప్రకటన.. ఓలా ఎలక్ట్రిక్ ఎక్కడ నిలిచింది?

Top 5 EVs: దేశంలో టాప్‌-5 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ప్రకటన.. ఓలా ఎలక్ట్రిక్ ఎక్కడ నిలిచింది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్‌ స్కూటర్ల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోసత్తా చాటాయి. అధిక విక్రయాలతో మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించాయి. మరోవైపు ఒకప్పుడు ఈవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా గణనీయంగా పడిపోయింది. టాప్‌-5 జాబితాలోనూ స్థానం దక్కించుకోలేకపోయింది. ఇదే సమయంలో గ్రీవ్స్ కాటన్ అనుబంధ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తొలిసారిగా టాప్‌-5లోకి ప్రవేశించింది. ఫిబ్రవరిలో మొత్తం 1,11,680 విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 46 శాతం వృద్ధిని సూచిస్తోంది.

Details

టీవీఎస్ ముందంజ

విద్యుత్‌ ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఫిబ్రవరిలో 31,600 యూనిట్లు విక్రయించింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 67 శాతం పెరుగుదల. దీంతో కంపెనీ ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్ రెండో స్థానం బజాజ్ ఆటో 25,323 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. సంస్థ విక్రయిస్తున్న Bajaj Chetak మోడల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. గతేడాదితో పోలిస్తే చేతక్‌ విక్రయాల్లో 17 శాతం వృద్ధి నమోదైంది. ఏథర్ మూడో స్థానం ప్రముఖ ఈవీ తయారీదారు అథర్ ఎనర్జీ 20,581 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానాన్ని సంపాదించింది. గతేడాదితో పోలిస్తే 72 శాతం వృద్ధి సాధించింది.

Details

హీరో మోటోకార్ప్‌ రికార్డు వృద్ధి

హీరో మోటోకార్ప్ తన విడా బ్రాండ్‌ ద్వారా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. ఫిబ్రవరిలో 12,512 యూనిట్లు అమ్ముడవగా, గతేడాదితో పోలిస్తే 364 శాతం రికార్డు స్థాయి వృద్ధి నమోదు చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్‌-5లోకి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంచనాలకు మించి ప్రదర్శనతో తొలిసారి టాప్‌-5 జాబితాలోకి ఎగబాకింది. గతేడాదితో పోలిస్తే 27 శాతం వృద్ధితో 4,725 యూనిట్లు విక్రయించింది. 'ఆంపియర్' పేరిట ఈ సంస్థ విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను మార్కెట్‌లో అందిస్తోంది. మొత్తంగా చూస్తే సంప్రదాయ ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ విభాగంలో దూకుడుగా ముందుకు సాగుతుండగా, ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ వెనుకబడడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement