Page Loader
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ బైక్ టాప్ ఫీచర్లు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 20, 2023
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బైక్‌ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఇంటర్‌సెప్టర్ 650 కోసం ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్ల కోసం విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు లైట్నింగ్. 2018లో బ్రిటీష్ మోటార్‌సైక్లింగ్ 1960ల స్టైల్ నుండి ప్రేరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650కు మంచి ఆదరణ లభించింది. ఆధునిక ఫీచర్ల పోటీ పెరగడంతో ఇప్పుడు ప్రత్యేక ఎడిషన్ లైట్నింగ్, థండర్ మోడళ్లను పరిచయం చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ స్టాండర్డ్ మోడల్ డిజైన్‌ తో ఉంటుంది. ఇందులో గుండ్రటి అద్దాలతో ఉన్న హ్యాండిల్‌బార్, గుండ్రని, క్రోమ్ చుట్టూ ఉన్న హాలోజన్ హెడ్‌లైట్, ఫ్లాట్-టైప్ సీటు, డ్యూయల్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్‌లు ఉన్నాయి.

బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ సీరీస్ లోని ప్రతి మోడల్‌కు యాక్సెసరీస్ లిస్ట్ ను అందిస్తుంది

ఇది సెమీ-డిజిటల్ ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ తో వైర్-స్పోక్డ్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. రైడర్ భద్రత కోసం ఇందులో డ్యూయల్-ఛానల్ ABSతో పాటు ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇతర తయారీ సంస్థలలాగా కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ సీరీస్ లోని ప్రతి మోడల్‌కు సంబంధించిన విస్తృతమైన యాక్సెసరీస్ లిస్ట్ ను అందిస్తుంది. ప్రత్యేక ఇంటర్‌సెప్టర్ 650 లైట్నింగ్ వేరియంట్‌లో అల్యూమినియం సంప్ గార్డ్, చిన్న ఇంజన్ గార్డ్‌లు, టూరింగ్ మిర్రర్స్, రిబ్బెడ్ ప్యాటర్న్‌తో కూడిన టూరింగ్ సీట్, ఫ్లై స్క్రీన్, CNC ఆయిల్ ఫిల్లర్ క్యాప్, రిమూవబుల్ సాఫ్ట్ వంటి అనేక రకాల యాడ్-ఆన్‌లు ఉన్నాయి. ఇది 648cc, 270-డిగ్రీ క్రాంక్‌తో కూడిన ట్విన్-సిలిండర్ ఇంజన్ తో నడుస్తుంది.