Page Loader
Nissan Magnite CNG: రూ.7 లక్షలలోపే టాప్ ఫీచర్లు.. నిస్సాన్ మాగ్నైట్ CNG హంగామా లాంచ్
రూ.7 లక్షలలోపే టాప్ ఫీచర్లు.. నిస్సాన్ మాగ్నైట్ CNG హంగామా లాంచ్

Nissan Magnite CNG: రూ.7 లక్షలలోపే టాప్ ఫీచర్లు.. నిస్సాన్ మాగ్నైట్ CNG హంగామా లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ ఇప్పుడు CNG వేరియంట్‌లోనూ లభించనుంది. ఈ వేరియంట్‌ను నిస్సాన్ భారత్‌లో రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. మాగ్నైట్ CNG వేరియంట్ ప్రత్యేకత ఏమిటంటే, దీని CNG కిట్ ఫ్యాక్టరీ ఫిట్‌మెంట్ కాకుండా డీలర్ స్థాయిలో రిట్రోఫిట్‌ చేశారు. అంటే, కారును కొన్న తరువాతే అధికారికంగా అనుమతించబడిన ఫిట్మెంట్ సెంటర్లలో కిట్‌ను అమర్చిస్తారు.

Details

మోటోజెన్ ద్వారా అభివృద్ధి, నాణ్యతతో నిస్సాన్ హామీ 

నిస్సాన్ ప్రకారం, ఈ CNG కిట్‌ను మోటోజెన్ అనే థర్డ్ పార్టీ సంస్థ దేశ రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, తయారు చేసి, నాణ్యత హామీ ఇచ్చింది. CNG కిట్‌లో 12 కిలోల సామర్థ్యం గల ఒకే ఒక సిలిండర్ ఉంటుంది. మోటోజెన్ ఈ కిట్‌కు వారంటీని కూడా అందిస్తోంది. ఈ CNG వేరియంట్‌ను దేశవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. మొదటి దశలో ఢిల్లీ-ఎన్‌సిఆర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నిస్సాన్ డీలర్ల వద్ద ఈ రిట్రోఫిట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మూడు సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ నిస్తుంది. తర్వాత దశలో మిగిలిన రాష్ట్రాల్లోకి విస్తరిస్తారు.

Details

నిస్సాన్ మాగ్నైట్ CNG స్పెసిఫికేషన్లు

ఈ వేరియంట్ 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జత చేశారు. నిస్సాన్ ఇంకా అధికారికంగా ఈ వేరియంట్ పవర్ అవుట్‌పుట్, మైలేజ్ గణాంకాలను వెల్లడించలేదు. సాధారణంగా CNG వేరియంట్లు పెట్రోల్ వేరియంట్ల కంటే తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయని భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నగరంలో కిలోకు 24 కిలోమీటర్లు, హైవే పై 30 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని అంచనా.

Details

ఫీచర్లు - టెక్నాలజీ, భద్రత రెండింటికీ ప్రాధాన్యం 

నిస్సాన్ మాగ్నైట్ CNG వేరియంట్‌లో 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైరలెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే), 7 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన గ్రాఫిక్స్‌తో పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యుఎస్బి టైప్-సి పోర్టులు ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉండదు. భద్రత పరంగా, ఈ వాహనంలో 6 ఎయిర్‌బ్యాగులు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, రీఇన్ఫోర్స్డ్ బాడీ స్ట్రక్చర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్టెంట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్టెంట్, ఎబిఎస్-ఇబిడి వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

Details

ధర వివరాలు

CNG కిట్‌ను అన్ని వేరియంట్లపై రూ. 75వేలు అదనంగా చెల్లించి పొందవచ్చు. నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ పెట్రోల్ వేరియంట్లు రూ.6.14 లక్షల నుంచి రూ.9.27 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. దీంతో, CNG వేరియంట్ విలువ రూ.6.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.