Maruti Suzuki : క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ.. మారుతీ నుంచి కొత్త ఎస్‌యూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లో చిన్నకార్ల రారాజుగా పేరుగాంచిన మారుతీ సుజుకీ, బ్రెజా, గ్రాండ్ విటారా మోడళ్లతో ఎస్‌యూవీ విభాగంలో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ రెండు మోడళ్ల విజయాన్ని, యుటిలిటీ వాహనాల పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు మారుతీ సుజుకీ కొత్త ఎస్‌యూవీని విడుదల చేయనుంది. 'ఎస్కుడో' (Escudo) పేరుతో రాబోతున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పండుగ సీజన్‌లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్, అంతర్జాతీయ అనుబంధం మారుతీ సుజుకీ ఇప్పటికే భారతదేశంలో 'ఎస్కుడో', 'టార్క్నాడో' పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. జపాన్ తదితర అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకీ విటారాకు 'ఎస్కుడో' పేరును ఉపయోగించడం తెలిసిందే. రాబోతున్న ఎస్కుడో భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
Details
క్రెటా, సెల్టోస్, కుషాక్ తదితర మోడళ్లతో పోటీ
ఈ పండుగ సీజన్ లో విడుదల కానున్న ఎస్కుడో ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
భారత్‌లో మారుతీ సుజుకీ 'అరేనా' నెట్‌వర్క్ ద్వారా ఎస్కుడో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్‌తో మరిన్ని ప్రత్యేకతలు
మారుతీ సుజుకీ ఎస్కుడో, గ్రాండ్ విటారాను ఆధారంగా చేసుకున్న సుజుకీ గ్లోబల్ C ప్లాట్‌ఫామ్ మీద రూపొందించబడే అవకాశం ఉంది.
అయితే ఎస్కుడోలో క్యాబిన్ అంతర్గత భాగం మరింత విశాలతతో ఉండే విధంగా పొడవైన వీల్‌బేస్ వంటి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని అంచనా.
Details
ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకునే ఇంటీరియర్
ఎస్కుడోలో ప్రీమియం ఫీచర్లను అందించనున్నారు. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో అనుసంధానం అయ్యే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డాష్‌బోర్డ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.
టాప్-ఎండ్ మోడళ్లలో సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు కూడా అందించే అవకాశం ఉంది.
పెట్రోల్, సీఎన్‌జీ, మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్లు
1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఎర్టిగా, బ్రెజా, గ్రాండ్ విటారా మోడళ్లలో ఉన్న ఈ ఇంజిన్ సాంకేతికతని ఎస్కుడోలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాక, సీఎన్‌జీ మోడల్ కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటాయి.
Details
ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో భద్రతకు ప్రాధాన్యం
మారుతీ సుజుకీ ఎస్కుడోలో అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయని అంచనా. అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్‌సీ ఉంటాయి.
టాప్ ఎండ్ ట్రిమ్‌లో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా అందుబాటులో ఉండవచ్చు.
ఎస్కుడో లాంచ్ తేదీ, పూర్తి ఫీచర్లు, ధర తదితర వివరాలు రానున్న రోజుల్లో మరింత వెల్లడయ్యే అవకాశం ఉంది.