LOADING...
Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్! 
టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్!

Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎస్‌యూవీ బ్రాండ్ టయోటా ఫార్చ్యూనర్‌ను కొనాలని చూస్తున్న వారికి ఇది శుభవార్త కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ధరలు తాజాగా పెరిగాయి. భారత మార్కెట్‌లో బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా కొనసాగుతున్న ఫార్చ్యూనర్ అన్ని వేరియంట్ల ధరలు ఇప్పుడు మరింత పెరిగాయి. ముఖ్యంగా పెట్రోల్ ఆటోమేటిక్ 4×2 వేరియంట్ ధర ఏకంగా రూ.68,000 పెరిగింది. డీజిల్ వేరియంట్లు, పర్ఫార్మెన్స్ ఆధారిత జీఆర్-ఎస్ ట్రిమ్, లెజెండర్ వేరియంట్లపై కూడా రూ.40,000 వరకు పెంపు జరిగింది. ఈ తాజా సర్దుబాట్ల అనంతరం ఫార్చ్యూనర్ ఎక్స్-షోరూమ్ ధరలు కనిష్ఠంగా రూ.36.05 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.52.34 లక్షల వరకు ఉన్నాయి.

Details

 అప్డేటెడ్ ధరలు ఇలా ఉన్నాయి

2.7L 4×2 పెట్రోల్ ఆటోమేటిక్ : రూ.36.05 లక్షలు 2.8L 4×2 డీజిల్ మాన్యువల్ : రూ. 36.73 లక్షలు 2.8L 4×2 డీజిల్ ఆటోమేటిక్ : రూ. 39.01 లక్షలు 2.8L 4×4 డీజిల్ మాన్యువల్: రూ. 40.83 లక్షలు 2.8L 4×4 డీజిల్ ఆటోమేటిక్ మైల్డ్ హైబ్రిడ్ : రూ. 44.72 లక్షలు జీఆర్-ఎస్ 2.8L 4×4 డీజిల్ ఆటోమేటిక్: రూ. 52.34 లక్షలు

Details

టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ స్పెషల్

కొద్ది రోజుల క్రితమే టయోటా సంస్థ ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇందులో 48 వోల్ట్ బ్యాటరీ వ్యవస్థతో కూడిన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉపయోగిస్తున్నారు. దీని లక్ష్యం మెరుగైన ఇంధన పొదుపు, పట్టణ డ్రైవింగ్‌లో సాఫీగా నడవడమే. బాడీ-ఆన్-ఫ్రేమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గ్రీన్ పవర్‌ట్రెయిన్ల దిశగా టయోటా వేయుతున్న అడుగుగా దీన్ని చూడవచ్చు.

Details

ప్రత్యేకతలు & కాన్ఫిగరేషన్లు

ఫార్చ్యూనర్‌లో కొనుగోలుదారులకు 2.7L పెట్రోల్, 2.8L డీజిల్ ఇంజిన్ల ఎంపికలతో పాటు, 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు లభ్యమవుతున్నాయి. అయితే 4×4 డ్రైవ్ కాన్ఫిగరేషన్ డీజిల్ వేరియంట్లకే పరిమితం. అత్యధిక ఖరీదైన వేరియంట్ జీఆర్-ఎస్, ఇది స్పోర్టియర్ లుక్స్, డైనమిక్ సస్పెన్షన్‌తో వస్తుంది. భారతదేశంలో టయోటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా ఇది ముందంజలో నిలుస్తోంది.