Loading...
Toyota Innova Hycross Facelift: నవంబర్ 25న కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఫీచర్లు ఇవే!
నవంబర్ 25న కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఫీచర్లు ఇవే!

Toyota Innova Hycross Facelift: నవంబర్ 25న కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 10, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్నోవా హైక్రాస్‌ రూపురేఖలను పూర్తిగా మార్చకుండా టయోటా కొన్ని మార్పులు చేయనుంది. ముఖ్యంగా ముందు భాగంలో కొత్త గ్రిల్‌, మారిన లైటింగ్‌ డిజైన్‌, మరింత ఆకర్షణీయమైన బంపర్‌ కనిపించే అవకాశం ఉంది. కొత్త అల్లాయ్‌ వీల్స్‌తో పాటు వెనుక బంపర్‌, టెయిల్‌ ల్యాంప్స్‌లోనూ స్వల్ప మార్పులు రావచ్చు.

Details

E85 ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ హైబ్రిడ్‌ ప్రత్యేకత

ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ టెక్నాలజీ.

గతంలో టయోటా 2.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, ఎలక్ట్రిక్‌ మోటార్‌తో కూడిన ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది.

ఇది పెట్రోల్‌తో పాటు 85 శాతం ఇథనాల్‌ కలిగిన E85 ఇంధనంతోనూ పనిచేసేలా రూపొందించారు.

దీనికోసం స్పార్క్‌ ప్లగ్స్‌, పిస్టన్‌ రింగ్స్‌, ఫ్యూయల్‌ పంప్‌, ట్యాంక్‌ వంటి భాగాల్లో మార్పులు చేశారు.

అయితే ఈ టెక్నాలజీ ఫైనల్‌ మోడల్‌లో వస్తుందా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.

Details

క్యాబిన్‌లోనూ కొత్త అప్‌డేట్స్‌?

లోపల డ్యాష్‌బోర్డ్‌ డిజైన్‌ దాదాపు ప్రస్తుత మోడల్‌లాగే ఉండవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌లో మార్పులు, కొత్త సాఫ్ట్‌వేర్‌, అప్‌డేటెడ్‌ సీటు అప్హోల్స్టరీ వంటి సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్‌ 2.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో రెండు ఆప్షన్లలో లభిస్తోంది.

సాధారణ పెట్రోల్‌ వెర్షన్‌ CVT గేర్‌బాక్స్‌తో 16.13 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ e-CVT వెర్షన్‌ 23.24 కిలోమీటర్ల ARAI మైలేజీని అందిస్తోంది.

ఈ రెండు E20 ఇంధనానికి అనుకూలంగా ఉంటాయి. నవంబర్‌ 25న విడుదల సమయంలో కొత్త మోడల్‌ ధరలు, ఫీచర్లు, ఇంజిన్‌ వివరాలపై స్పష్టత రానుంది.

ADVERTISEMENT