Page Loader
Innova Hycross: భారత్ NCAP భద్రతా రేటింగ్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌..!
భారత్ NCAP భద్రతా రేటింగ్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌..!

Innova Hycross: భారత్ NCAP భద్రతా రేటింగ్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్‌ కారు ఒక విశేషమైన మైలురాయిని అధిగమించింది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన భద్రత ప్రమాణాల పరీక్షలైన భారత్‌ ఎన్‌క్యాప్‌(Bharat NCAPలో ఎంపీవీ (MPV)విభాగంలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి కారుగా నిలిచింది. మూడు వరుసల సీట్లు కలిగిన కార్లలో ఈ రేటింగ్‌ అందుకున్న తొలి మోడల్‌ కావడం విశేషం. ఇది ఎంపీవీ విభాగంలో అత్యంత భద్రత కలిగిన కారుగా గుర్తింపు పొందింది.ఈ భద్రతా పరీక్షల్లో స్ట్రాంగ్‌ హైబ్రీడ్‌,నాన్‌-హైబ్రీడ్‌ వేరియంట్లు రెండింటినీ పరీక్షించారు. పెద్దల రక్షణకు సంబంధించి 32పాయింట్లలో 30.47పాయింట్లు,పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు సాధించింది. ముఖ్యంగా ముందు, వైపు ఢీకొన్న సందర్భాల్లో (Front & Side Crash Tests)ఈ కారు అత్యధిక రేటింగ్‌ సాధించింది.

వివరాలు 

తల, మోకాల్లు, నడుము వంటి కీలక భాగాలకు గట్టి రక్షణ

తల, మోకాల్లు, నడుము వంటి కీలక భాగాలకు గట్టి రక్షణను అందించింది. డ్రైవర్‌ ఛాతీ భాగం, ఎడమ పాదంపై వచ్చే ప్రమాద తీవ్రతను కూడా ఇది సమర్థంగా తగ్గించింది. వైపు ఢీకొనడంపై జరిగే టెస్ట్‌లో (Side Impact Test)మొత్తం 16పాయింట్లలో 16పాయింట్లూ సంపాదించింది. ఇన్నోవా హైక్రాస్‌ బేస్‌ మోడల్‌ నుంచే ప్రయాణికుల భద్రతకు అనేక కీలక ఫీచర్లను అందిస్తోంది. వాటిలో ఆరు ఎయిర్‌బ్యాగులు,ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC),యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌(ABS), హిల్‌ స్టార్ట్‌ అసిస్టెన్స్, మరియు మూడు వరుసల సీట్లకు సీట్‌బెల్ట్‌ రిమైండర్‌ వంటి వాటిని అందిస్తోంది. ఈఫీచర్లు అన్ని వేరియంట్లలో లభ్యమవుతుండగా,హైఎండ్‌ మోడల్స్‌లో అదనంగా అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌(ADAS),360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

వివరాలు 

ఈ మోడల్‌ 174 బీహెచ్‌పీ శక్తి విడుదల

ఈ కారులో టయోటా ఐదో తరం సెల్ఫ్‌ చార్జింగ్‌ స్ట్రాంగ్‌ హైబ్రీడ్‌ ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌ వినియోగించారు. దీని‌తో పాటు 2.0 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ను జత చేశారు. ఇది 186 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కంపెనీ తెలిపిన ప్రకారం,ఈ వాహనం లీటర్‌ పెట్రోల్‌కు 21.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పూర్తి ట్యాంక్‌తో 1,097 కిలోమీటర్లు ప్రయాణించగలదు.హైబ్రీడ్‌ వేరియంట్‌ కేవలం 10 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుంది. ఇన్నోవా హైక్రాస్‌ కారు పూర్తిగా 2.0 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో కూడిన వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో సీవీటీ (CVT) ట్రాన్స్‌మిషన్‌ అమర్చారు. ఈ మోడల్‌ 174 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.