Urban Cruiser Ebella: టయోటా నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా భారత్‌లో లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. 'టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మిడ్‌సైజ్ సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జడ్‌ఎస్ ఈవీ, మారుతీ సుజుకీ ఈ-విటారా వంటి మోడళ్లకు పోటీగా ఈ కారును తీసుకొచ్చింది. మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించినప్పటికీ, టయోటా ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్లను ఇందులో జోడించింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.23.60 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.
వివరాలు
రెండు బ్యాటరీ వేరియంట్లు
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో 49kWh మరియు 61kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ వేరియంట్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 172 బీహెచ్‌పీ పవర్, 189 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
డిజైన్, ఫీచర్లు
ఈ ఎస్‌యూవీలో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. ఐదు మోనోటోన్, నాలుగు డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. క్యాబిన్‌లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
వివరాలు
ప్రీమియం సౌకర్యాలు
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పనోరమిక్ సన్‌రూఫ్, 12 కలర్ ఆప్షన్లతో యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అదనంగా వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్-క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి ఫీచర్లను కూడా కంపెనీ అందించింది. భద్రతకు పెద్దపీట భద్రత పరంగా ఈ కారులో స్టాండర్డ్‌గా 7 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. అలాగే ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌పీ, 360 డిగ్రీల కెమెరా, లెవల్-2 అడాస్ ఫీచర్లను కూడా టయోటా అందించింది.