Toyota: హైలాండర్‌కు ఎలక్ట్రిక్ అవతారం.. టయోటా కొత్త ఈవీ ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
టయోటా తన ఎస్‌యూవీ శ్రేణిలో కీలక మార్పుగా తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా Toyota హైలాండర్ ఈవీని ఆవిష్కరించింది. 2027 మోడల్‌గా రానున్న ఈ కొత్త హైలాండర్, 2019 నుంచి అమెరికాలో అమ్మకాల్లో ఉన్న నాలుగో తరం మోడల్‌కు పూర్తిగా భిన్నంగా కొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్, ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. ఇది టయోటా అమెరికా మార్కెట్‌లో నాలుగో ఈవీ కాగా, మూడు వరుసల సీట్లతో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ వాహనం కావడం విశేషం.
వివరాలు
గరిష్టంగా 462 కిలోమీటర్ల రేంజ్
ఈ కారు XLE,లిమిటెడ్ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. బేసిక్ XLE వేరియంట్‌లో 77కిలోవాట్-ఆర్ బ్యాటరీతో సింగిల్ మోటార్ ఉండి 221హెచ్‌పీ పవర్, 268 ఎన్‌ఎం టార్క్ అందిస్తూ గరిష్టంగా 462 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ XLE వేరియంట్‌లో పవర్ 338 హెచ్‌పీకి,టార్క్ 445 ఎన్‌ఎం వరకు పెరుగుతుండగా రేంజ్ స్వల్పంగా తగ్గి 435కిలోమీటర్లుగా ఉంటుంది. ప్రీమియం XLE AWD లేదా లిమిటెడ్ మోడళ్లలో పెద్ద 95.8కిలోవాట్-ఆర్ బ్యాటరీని ఎంచుకునే అవకాశం ఉండి, పవర్ తగ్గకుండా ఏకంగా 515 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అన్ని వేరియంట్లలో నార్త్ అమెరికన్ ఛార్జింగ్ స్టాండర్డ్ పోర్ట్, అలాగే వాహనం నుంచి బయట పరికరాలకు కరెంట్ ఇచ్చే V2L టెక్నాలజీ కూడా ఉంది.
వివరాలు
ఈవీ ఉత్పత్తి 2026చివర్లో కెంటుకీలోని జార్జ్‌టౌన్ ప్లాంట్‌లో ప్రారంభమవుతుంది
లుక్ పరంగా షార్ప్ లైన్లు,వెడల్పైన ఫెండర్లు,ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు,సెమీ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌తో ఆకర్షణీయంగా కనిపించే ఈ కారు, 14 ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 12.3 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మూడు వరుసల సీట్లకూ ఛార్జింగ్ సదుపాయం కలిగి ఉంది. టయోటా వాహనాల్లోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ గ్లాస్ పనోరమిక్ రూఫ్, 64 రంగుల్లో మార్చుకునే అంబియెంట్ లైటింగ్ కూడా ఆప్షన్‌గా ఇవ్వనున్నారు. భద్రత విషయంలో టయోటా సేఫ్టీ సెన్స్ 4.0,పాదచారుల గుర్తింపు ఉన్న ప్రీ-కాలిజన్ సిస్టమ్,లేన్ అసిస్ట్,రోడ్ సైన్ అసిస్ట్,బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. 2027 హైలాండర్ ఈవీ ఉత్పత్తి 2026చివర్లో కెంటుకీలోని జార్జ్‌టౌన్ ప్లాంట్‌లో ప్రారంభమవుతుందని టయోటా తెలిపింది.