LOADING...
Bugatti Bolide: బుగట్టి బొలైడ్‌కు స్ట్రీట్ లీగల్ హోదా.. లాంజాంటే సరికొత్త మార్పులు
బుగట్టి బొలైడ్‌కు స్ట్రీట్ లీగల్ హోదా.. లాంజాంటే సరికొత్త మార్పులు

Bugatti Bolide: బుగట్టి బొలైడ్‌కు స్ట్రీట్ లీగల్ హోదా.. లాంజాంటే సరికొత్త మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత అరుదైన హైపర్‌కార్లలో ఒకటైన బుగట్టి బొలైడ్ ఇప్పుడు రోడ్లపై కూడా పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. బ్రిటన్‌కు చెందిన ఆటో మొబైల్ ఇంజినీరింగ్ సంస్థ లాంజాంటే లిమిటెడ్ ట్రాక్‌పై మాత్రమే నడిచే ఈ ప్రత్యేక కారును స్ట్రీట్ లీగల్ హైపర్‌కార్‌గా మార్చింది. ఈ ప్రాజెక్టును 2026 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ సందర్భంగా అధికారికంగా ఆవిష్కరించింది. బుగట్టి బొలైడ్‌ను 2024-2025 మధ్య కేవలం 40 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. ఇవన్నీ రేస్ ట్రాక్‌ల కోసం రూపొందించబడినవే. ఫ్యాక్టరీ నుంచి రోడ్లపై నడిపేందుకు అనుమతి లేకపోవడంతో, లాంజాంటే ప్రత్యేక మార్పులు చేసి ప్రజా రహదారులపై నడిచేలా తీర్చిదిద్దింది.

వివరాలు 

ట్రాక్ రేసింగ్ కోసం ఉన్న గట్టి సస్పెన్షన్‌ను రోడ్లకు అనువుగా మరింత సౌకర్యవంతంగా..

రోడ్లపై వినియోగానికి అనుగుణంగా కారులో పలు మార్పులు చేశారు. అసలు బొలైడ్‌లో హెడ్‌లైట్లు ఉండవు. ఎందుకంటే రేస్ ట్రాక్‌లలో ప్రత్యేక లైటింగ్ సదుపాయం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని లాంజాంటే కారు ముందు భాగంలోని'ఎక్స్'డిజైన్‌కు సరిపోయేలా కొత్త ఎక్స్ ఆకారపు LED హెడ్‌లైట్లు అమర్చింది. అలాగే ట్రాక్ రేసింగ్ కోసం ఉన్న గట్టి సస్పెన్షన్‌ను రోడ్లకు అనువుగా మరింత సౌకర్యవంతంగా మార్చింది. తక్కువ ఆయుష్షు,అధిక ధర కారణంగా మిషెలిన్ రేసింగ్ స్లిక్ టైర్ల స్థానంలో సాధారణ రోడ్డు వినియోగానికి తగిన టైర్లను అమర్చింది. ఇన్ని మార్పులు చేసినప్పటికీ బొలైడ్‌లోని శక్తివంతమైన ఇంజిన్‌ను మాత్రం అలాగే ఉంచింది. ఇందులో ఉన్న 8.0లీటర్ క్వాడ్-టర్బో W16ఇంజిన్ బుగట్టి చిరోన్ వంటి రోడ్డు కార్లలో కూడా ఉపయోగించబడింది.

వివరాలు 

1,600 హార్స్‌పవర్

ఈ ఇంజిన్ దాదాపు 1,600 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. లాంజాంటే మార్పుల తర్వాత కూడా కారు బరువు 1,451 కిలోల కంటే తక్కువగానే ఉండటంతో, పనితీరు మరింత ఉత్సాహాన్ని కలిగించేలా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ స్ట్రీట్ లీగల్ మార్పులతో బుగట్టి బొలైడ్ భవిష్యత్తులో సేకరణదారులు ఎక్కువగా కోరుకునే అరుదైన కారుగా మారే అవకాశం ఉంది. అసలు బొలైడ్ ధర సుమారు 4.7 మిలియన్ డాలర్లు కాగా, ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కొన్ని మోడళ్ల ధరలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం లాంజాంటే ఈ ఐకానిక్ హైపర్‌కార్‌కు కనీసం రెండు స్ట్రీట్ లీగల్ వెర్షన్లపై పని చేస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement