400-450 cc bikes: ట్రయంఫ్ స్పీడ్ 400 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 - ఏది బెస్ట్?
400-450 సీసీ బైక్స్‌కి మార్కెట్‌లో పోటీ రోజురోజుకి పెరుగుతోంది. ట్రయంఫ్ స్పీడ్ 400, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ల మధ్య పోటీ కూడా రసవత్తరంగా ఉంది. ఈ రెండు బైకులు పర్ఫార్మెన్స్, సస్పెన్షన్, బ్రేకింగ్, ఫీచర్స్, ధర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రయంఫ్ స్పీడ్ 400లో 398 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో 8,000 ఆర్‌పీఎంలో 39 బీహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎంలో 37.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే గెరిల్లా 450 కూడా 450 సీసీ ఇంజిన్ కలిగి ఉండి 39 బీహెచ్‌పీతో పాటు 5,500 ఆర్‌పీఎంలో 40 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ. 2.4 లక్షలు
ట్రయంఫ్ స్పీడ్ 400లో ముందు 43 ఎంఎం అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లు, వెనుక 130 ఎంఎం ట్రావెల్ మోనోషాక్ ఉన్నాయి. గెరిల్లా 450లో ముందు 140 ఎంఎం ట్రావెల్ ఫోర్క్‌లు, వెనుక 150 ఎంఎం లింకేజ్ మోనోషాక్ ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 యూఎస్బి-సీ ఛార్జర్, హీట్ గ్రిప్స్ వంటి ఆధునిక ఫీచర్స్‌తో పాటు స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కలిగి ఉంది. ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ. 2.4 లక్షలు కాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధర రూ. 2.39 లక్షలు ఉంటుంది. ఇంజిన్ టార్క్, ఫీచర్స్ పరంగా గెరిల్లా బైక్ కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది.