LOADING...
TVS Apache: టీవీఎస్ అపాచీ 2025 RR 310 లాంచ్.. ధర కూడా తక్కువే!
టీవీఎస్ అపాచీ 2025 RR 310 లాంచ్.. ధర కూడా తక్కువే!

TVS Apache: టీవీఎస్ అపాచీ 2025 RR 310 లాంచ్.. ధర కూడా తక్కువే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్‌ తాజాగా 2025 అపాచీ RR 310 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 20 ఏళ్ల విజయయాత్రను పూర్తి చేసుకున్న టీవీఎస్ అపాచీ, ఇప్పటికే 60 లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకొని, ఓ మైలురాయి అందుకుంది. తాజా వర్షన్‌ను OBD-2B (On-Board Diagnostics) ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. ఈ బైక్‌ ధరలు రూ.2,77,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి.

Details

ఇంజిన్, పనితీరు

2025 అపాచీ RR 310లో 312cc రివర్స్ ఇన్‌క్లెయిన్డ్ DOHC ఇంజిన్‌ ఉంది. ఇది గరిష్ఠంగా 38 PS పవర్‌ను, 29 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గియర్‌బాక్స్‌తో పాటు బైక్‌లో ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్‌ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. 8-స్పోక్ అలాయ్ వీల్స్‌తో శక్తివంతమైన రూపాన్ని ఇస్తోంది. వేరియంట్ల ధరలు కొత్త అపాచీ RR 310లో స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు, బిల్ట్ టు ఆర్డర్ (BTO) కస్టమైజేషన్ ఆప్షన్‌ కూడా ఉంది. వేరియంట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి: రెడ్ వేరియంట్ (క్విక్ షిఫ్టర్ లేకుండా) - రూ.2,77,999 రెడ్ వేరియంట్ (క్విక్ షిఫ్టర్‌తో) - రూ.2,94,999 బాంబర్ గ్రే వేరియంట్ - రూ.2,99,999

Details

BTO ఆప్షన్‌లో ఉన్న అదనపు కిట్లు

డైనమిక్ కిట్ - రూ.18,000 డైనమిక్ ప్రో కిట్ - రూ. 16,000 రేస్ రిప్లికా ప్యాకేజీ - రూ. 10,000 డిజైన్, ఫీచర్లు కొత్త మోడల్‌లో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చేయలేదు. పూర్వపు మోడల్‌లాగే LED హెడ్ల్యాంప్‌లు, టెయిల్‌లైట్లు, వింగ్‌లెట్లు, స్ప్లిట్ సీటింగ్ సెటప్ ఉన్నాయి. బైక్‌లో ఉన్న ప్రధాన ఫీచర్లు రైడ్ మోడ్‌లు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) క్రూయిజ్ కంట్రోల్ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ

Details

 సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ 

ఈ బైక్‌కి ముందు భాగంలో ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే: ముందు భాగంలో 300mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో - 240mm డిస్క్ బ్రేక్ ఉండనుంది.