LOADING...
TVS Apache RTX 300: తోలి అడ్వెంచర్‌ బైక్ ను విడుదల చేసిన టీవీఎస్‌ అపాచీ RTX 300.. 
తోలి అడ్వెంచర్‌ బైక్ ను విడుదల చేసిన టీవీఎస్‌ అపాచీ RTX 300..

TVS Apache RTX 300: తోలి అడ్వెంచర్‌ బైక్ ను విడుదల చేసిన టీవీఎస్‌ అపాచీ RTX 300.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తమ మొదటి అడ్వెంచర్ బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. 'అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300' పేరిట దీన్ని తీసుకొచ్చింది.ఎక్స్‌-షోరూం ధరను రూ. 1.99 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్ ద్వారా టీవీఎస్‌ అడ్వెంచర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. దీన్ని KTM 250 అడ్వెంచర్‌, Yezdi అడ్వెంచర్‌,రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్‌ 440 వంటి బైకులతో ప్రత్యర్థిగా చూడవచ్చు. అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300లో 299 సీసీ లిక్విడ్-ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ RT-XD4 ఇంజిన్ను కొత్తగా అభివృద్ధి చేశారు. ఇది 35.5 హెచ్‌పీ పవర్,28.5 ఎంఎన్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.బైక్‌లో 6-స్పీడ్ గియర్ బాక్స్,బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వివరాలు 

తొలి అడ్వెంచర్‌ బైక్‌ కావడంతో యూత్‌లో దీనిపై క్రేజ్‌ 

ఇంజిన్ సమాచారంతో పాటు,బైక్‌లో ఫుల్-కలర్ TFT డిస్‌ప్లే,మ్యాప్ మిర్రరింగ్,GoPro కంట్రోల్, కాల్ & SMS అలర్ట్స్ వంటి టెక్నాలజీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రైడ్ మోడ్‌లుగా టూర్,ర్యాలీ,అర్బన్, రైన్ వంటి నాలుగు విభిన్న మోడ్‌లు ఉన్నాయి. భద్రత కోసం ABS,ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, TPMS వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. రంగుల పరంగా ఈ బైక్ వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్‌నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్లో లభిస్తుంది. టీవీఎస్‌కి ఇది మొదటి అడ్వెంచర్ బైక్ కావడం వలన యువతలో దీని మీద భారీ ఆసక్తి ఏర్పడింది. ధర,ఇతర స్పెసిఫికేషన్ల కోసం వినియోగదారులు ఎక్కువగా వెతికుతున్నారు. దీంతో ఈ బైక్ గూగుల్ ట్రెండ్స్లో కూడా చేరింది.