TVS iQube S: కొత్త బ్యాటరీతో TVS iQube S స్కూటర్ లాంచ్.. 175 కి.మీ రేంజ్, అదిరిపోయేలా ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఆటో మొబైల్ సంస్థ TVS మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. కొత్తగా iQube S 4.7 kWh వేరియంట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మోడల్‌లో 4.7 kWh పెద్ద బ్యాటరీని అందిస్తూ, ముందు ఉన్న 3.5 kWh వేరియంట్‌కు బదులుగా తీసుకొచ్చారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,37,142గా నిర్ణయించారు. కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఈ స్కూటర్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ స్కూటర్‌లో 4.7 kWh బ్యాటరీ ఉండగా,గరిష్టంగా 5.9 hp పవర్,33 Nm టార్క్ ఇస్తుంది. పోర్టబుల్ చార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ కావడానికి సుమారు 4 గంటలు పడుతుందని కంపెనీ చెబుతోంది.
వివరాలు
ఫీచర్లు
ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 175 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని, టాప్ స్పీడ్ 82 కి.మీ/గంటగా ఉందని వెల్లడించింది. అలాగే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని కేవలం 4.3 సెకన్లలో అందుకుంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో TFT డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్, క్రాష్ అలర్ట్, ఫాల్ అలర్ట్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
వివరాలు
ఫీచర్లు
IP67 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించారు. హార్డ్‌వేర్ పరంగా చూస్తే, స్కూటర్ బరువు 128.8 కిలోలు, సీట్ హైట్ 770 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 157 mmగా ఉంది. 12 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు. బ్రేకుల కోసం ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఇచ్చారు. కలర్ ఆప్షన్లలో Magnificence Purple Beige, Harlequin Blue Beigeతో పాటు Titanium Grey Matte రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.