Page Loader
TVS Jupiter: టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్‌తో మైలేజ్, పెట్రోల్ ఖర్చులు భారీగా ఆదా..
టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్‌తో మైలేజ్, పెట్రోల్ ఖర్చులు భారీగా ఆదా..

TVS Jupiter: టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్జీ స్కూటర్‌తో మైలేజ్, పెట్రోల్ ఖర్చులు భారీగా ఆదా..

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్రాఫిక్ సమస్యలు, రహదారి పరిస్థితులు బాగోలేకపోవడం వంటి కారణాలతో ఇటీవలి కాలంలో వాహనాల మైలేజ్ తగ్గిపోతోంది. మార్కెట్లో ఉన్న 2 వీలర్ స్కూటర్లు సుమారు 45-55 కి.మీ మైలేజ్ ఇస్తున్నాయి. దీనివల్ల పెట్రోల్ ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే, ఇప్పుడు అత్యధిక మైలేజ్ ఇచ్చే ఒక స్కూటర్ ఇండియాలో విడుదలకు సిద్ధంగా ఉందని మీకు తెలుసా? ఈ స్కూటర్ 226 కి.మీ మైలేజ్ ఇస్తుందని తెలిసింది. టీవీఎస్ మోటార్స్ తయారు చేస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్ అయిన జూపిటర్ 125 CNG, దాని లాంచ్ ధర అంచనాల వివరాలు మీకోసం..

వివరాలు 

టీవీఎస్ జూపిటర్ 125 CNG స్కూటర్ వివరాలు: 

2025 జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టీవీఎస్ సంస్థ జూపిటర్ 125 CNG కాన్సెప్ట్ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది సాధారణ జూపిటర్ 125 స్కూటర్ ఆధారంగా రూపొందించబడింది. ప్రపంచ మార్కెట్లో తొలి CNG బైక్‌గా బజాజ్ ఫ్రీడమ్ 125 గుర్తింపు పొందింది.కానీ అన్ని అనుకున్నట్టు జరిగితే,ఈ టీవీఎస్ జూపిటర్ 125 CNG ప్రపంచంలోనే తొలి CNG స్కూటర్‌గా నిలవబోతోంది. కొత్త టీవీఎస్ జూపిటర్ 125 CNG స్కూటర్‌లో 1.4 కిలోల సామర్థ్యంతో 9 లీటర్ల CNG ట్యాంక్ ఉంటుంది. ఈ CNG సిలిండర్ సీటు కింద అమర్చారు.సాధారణ జూపిటర్ 125లో సీటు క్రింద బూట్ ఉంటుంది.

వివరాలు 

ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ: 

టీవీఎస్ జూపిటర్ 125 CNGలో పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యాన్ని ఐదు లీటర్ల నుండి రెండు లీటర్లకు తగ్గించారు. ట్యాంక్ ఇప్పటికీ ఫ్లోర్బోర్డ్ కింద ఉంటుంది. అప్రాన్ వెనుక భాగంలో ఉన్న బాహ్య ఇంధన ఫిల్లర్ ద్వారా పెట్రోల్ నింపవచ్చు. ఫ్లోర్బోర్డ్ ప్రాంతంలో రెండు హుక్‌లు, ఒక స్టోరేజ్ స్పేస్ కూడా ఉన్నాయి. స్కూటర్‌కు కొంత స్టోరేజ్ ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. కంపెనీ ప్రకారం, ఈ స్కూటర్ ఒక్క కిలో CNGతో సుమారు 84 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మొత్తం కలిపితే CNG,పెట్రోల్ మిశ్రమంగా 226 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెప్పబడింది. స్కూటర్‌లో ఫ్యూయెల్ ఆప్షన్ మార్చే స్విచ్ ఫ్లిక్ ఎంపిక ఉంటుంది. ఈ స్కూటర్ కిలోమీటరుకు సుమారు రూ. 1 రన్నింగ్ ఖర్చుతో పని చేస్తుంది.

వివరాలు 

స్పెసిఫికేషన్లు

జూపిటర్ 125 CNGలో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది CNGతో పనిచేస్తుంది. ఈ వెర్షన్ 6,000 ఆర్‌పీఎంలో 7.1 బీహెచ్‌పి పవర్, 5,500 ఆర్‌పీఎంలో 9.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు/గంట. విజువల్ గా చూస్తే, స్టాండర్డ్ జూపిటర్ 125తో పోలిస్తే పెద్ద తేడా లేదు. CNG సిలిండర్ ఉండడం గమనార్హం అయినప్పటికీ సీట్ హైట్ ఎక్కువగా మారలేదు.

వివరాలు 

లాంచ్ & ధర అంచనా: 

పలు మీడియా రిపోర్టుల ప్రకారం, ఈ టీవీఎస్ జూపిటర్ 125 CNG ఈ ఏడాది అక్టోబర్ నెలలో మార్కెట్లోకి రానుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ. 95,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉండవచ్చు. అయితే, అధికారికంగా సంస్థ లాంచ్, ధర విషయాలు ప్రకటించాల్సి ఉంది.