LOADING...
TVS Apache RTR 200 4V: కొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200ను తీసుకొచ్చిన టీవీఎస్‌ సంస్థ.. దీని ధరెంతంటే?
కొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200ను తీసుకొచ్చిన టీవీఎస్‌ సంస్థ.. దీని ధరెంతంటే?

TVS Apache RTR 200 4V: కొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200ను తీసుకొచ్చిన టీవీఎస్‌ సంస్థ.. దీని ధరెంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర మరియు త్రిచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ, 2025 మోడల్‌కు చెందిన అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ సిరీస్‌ మోటార్ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రభుత్వం విధించిన తాజా ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలను అనుసరించి ఈ వాహనాన్ని రూపొందించారని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఆధునిక సాంకేతికత,అద్భుతమైన పనితీరు,మెరుగైన భద్రతా లక్షణాలు సమన్వయం చేశారని వివరించింది. ఈ మోడల్‌ ధరను రూ.1,53,990(ఎక్స్‌షోరూమ్‌,ఢిల్లీ)గా నిర్ణయించగా,దేశవ్యాప్తంగా అన్ని టీవీఎస్ డీలర్‌షిప్‌లలో ఈ వాహనం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈమోటార్‌ సైకిల్‌లో ఓబీడీ2బీ నిబంధనలతో పాటుగా,37ఎంఎం అప్‌సైడ్‌ డౌన్ ఫ్రంట్ సస్పెన్షన్, హైడ్రో ఫార్మ్‌డ్ హ్యాండిల్‌బార్ వంటి ఫీచర్లను అందించడం ద్వారా మరింత మెరుగైన హ్యాండ్లింగ్‌ను అందించేలా చేశారు.

వివరాలు 

17.25 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి

అలాగే రీఫ్రెష్డ్ గ్రాఫిక్స్, కొత్త రంగుల ఎంపికలతో వాహనాన్ని తీర్చిదిద్దారు.ఆన్‌బోర్డ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ (OBD2B)ను కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేశారు. పవర్ పరంగా చూస్తే,ఈ బైక్ 20.8 పీఎస్ శక్తి, 17.25 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. భద్రతా ఫీచర్లలో డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, మూడు రైడింగ్ మోడ్లు.. అర్బన్‌, స్పోర్ట్‌, రెయిన్‌, స్లీపర్ క్లచ్ వంటి ప్రధానమైన ఫీచర్లు ఉన్నాయి. అదనంగా,ఈ బైక్‌కి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి. గ్లాసీ బ్లాక్‌, మ్యాటీ బ్లాక్‌, గ్రానైట్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ మోడల్ అందుబాటులో ఉంటుంది.