TVS NTorq Race XP:టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ వర్సెస్ వర్సెస్ హీరో జూమ్ 125ఆర్.. ఈ రెండింట్లో ఏదీ కొనాలి
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్ దేశీయ మార్కెట్లోకి టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీని విడుదల చేసింది. ఈ వాహనానికి మార్కెట్‌లో వీపరితమైన క్రేజ్ ఏర్పడింది. ఇక దీనికి పోటీగా మార్కెట్లోకి హీరో జూమ్ 125ఆర్ వచ్చేసింది. ఇందులో సరికొత్త Xoom 160 అడ్వెంచర్‌తో పాటుగా వస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ రెండు బైకుల ఫీచర్ల గురించి తెలుసుకుందాం. NTorq 125 ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. ఇది 125cc సెగ్మెంట్‌లో రానుంది. అయితే Hero MotoCorp ఇప్పుడు కొత్త Xoom 125Rతో ఈ విభాగంలో NTorq 125కి ప్రత్యర్థిగా నిలిచింది.
టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ అత్యాధునిక ఫీచర్లు
Hero Xoom 125Rలో DRLతో కూడిన ఆప్రాన్-మౌంటెడ్ LED హెడ్‌ల్యాంప్, సీక్వెన్షియల్ LED సూచికలు, సింగిల్-పీస్ సీట్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇక బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. TVS NTorq 125లో XP DRLలతో కూడిన ఆప్రాన్-మౌంటెడ్ LED హెడ్‌లైట్, విస్తృత హ్యాండిల్‌బార్, సైడ్-మౌంటెడ్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదేవిధంగా అగ్రెసివ్ డీకాల్స్‌తో కూడిన ప్రత్యేక డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్, 12-అంగుళాల డిజైనర్ వీల్స్, బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇండియాలో TVS NTorq 125 రేస్ XP రూ. 96,741 ఉండగా, Hero Xoom 125R ధర సుమారుగా రూ. 85,000 ఉంది.