Loading...
TVS Star City Plus: టీవిఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్‌కు బ్రేక్‌.. కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి తొలగింపు
టీవిఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్‌కు బ్రేక్‌.. కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి తొలగింపు

TVS Star City Plus: టీవిఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్‌కు బ్రేక్‌.. కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి తొలగింపు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 22, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

కమ్యూటర్‌ బైక్‌ ఆటో మొబైల్‌ మార్కెట్లో ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న TVS Star City Plus ఇప్పుడు కంపెనీ అధికారిక భారత వెబ్‌సైట్‌ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఈ 110cc బైక్‌ ఉత్పత్తిని నిలిపివేశారనే చర్చ మొదలైంది. TVS Motor నుంచి దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుతం కంపెనీ కమ్యూటర్‌ విభాగంలో Radeon, Sport మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటితో పోలిస్తే Star City Plus మాత్రమే వెబ్‌సైట్‌ నుంచి మాయమవడం ఆసక్తికరంగా మారింది. డీలిస్టింగ్‌ చూస్తే బైక్‌ ఉత్పత్తి దశ ముగిసే అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Details

2026లో అమ్మకాలు అంతంతమాత్రమే

Star City Plusకు కొత్త అప్‌డేట్‌ వచ్చి కూడా చాలా కాలమే అయింది. 2021 మార్చిలో రోటో పెటల్‌ ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌ తీసుకొచ్చిన తర్వాత పెద్దగా మార్పులు కనిపించలేదు.

ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌లో చేసిన మార్పులు మినహా బైక్‌కు చెప్పుకోదగ్గ అప్‌డేట్‌ రాలేదు. మరోవైపు అమ్మకాలు కూడా నిరాశపరిచాయి.

2026 తొలి నాలుగు నెలల్లో కేవలం 49 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నుంచి సెప్టెంబర్‌ వరకు ఒక్క యూనిట్‌ కూడా నమోదుకాకపోవడం పరిస్థితిని మరింత స్పష్టం చేస్తోంది.

Details

109.7cc ఇంజిన్‌తో వచ్చిన బైక్

Star City Plusలో 109.7cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉండేది. ఇది 7,350rpm వద్ద 8.2 హెచ్‌పీ పవర్‌, 4,500rpm వద్ద 8.7Nm టార్క్‌ ఉత్పత్తి చేసేది.

నాలుగు గేర్‌ల గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్‌ను జత చేశారు. రోజువారీ ప్రయాణాలకు సరిపోయేలా రూపొందించిన ఈ బైక్‌లో LED హెడ్‌ల్యాంప్‌, సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, USB ఛార్జింగ్‌ పోర్ట్‌, ఎలక్ట్రిక్‌ సెల్ఫ్‌ స్టార్ట్‌ వంటి ఫీచర్లు ఉండేవి.

వెనుక షాక్‌ అబ్జార్బర్‌కు ఐదు దశల్లో ప్రీలోడ్‌ సర్దుబాటు సౌకర్యం కూడా ఉండేది.

ADVERTISEMENT

Details

12 ఏళ్ల ప్రయాణానికి ముగింపు?

Star City Plusను TVS తొలిసారిగా 2014లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దాదాపు 12 ఏళ్ల పాటు కంపెనీ బడ్జెట్‌ కమ్యూటర్‌ బైక్‌గా కొనసాగింది.

17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, ట్యూబ్‌లెస్‌ టైర్లు, స్టార్‌ గ్రాఫిక్స్‌తో పాటు డ్రమ్‌, డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్లలో ఇది లభించేది. ప్రారంభంలో రోజువారీ అవసరాలకు సరిపోయే సరళమైన బైక్‌గా వినియోగదారులను ఆకట్టుకున్నా, కాలక్రమంలో కొత్త మోడళ్ల పోటీ పెరిగింది. అప్‌డేట్లు తగ్గడం, అమ్మకాలు పడిపోవడంతో ఇప్పుడు దీని భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT

Details

TVS కమ్యూటర్‌ లైనప్‌లో ఇక రెండు బైక్‌లే

Star City Plus వెబ్‌సైట్‌ నుంచి తొలగిపోవడంతో TVS Motor ఎంట్రీ లెవల్‌ కమ్యూటర్‌ విభాగంలో Radeon, Sport మోడళ్లపైనే ఆధారపడుతోంది. ఈ రెండు బైక్‌లు ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో కొనసాగుతున్నాయి.

Star City Plus విషయంలో మాత్రం ఉత్పత్తి నిలిపివేతపై కంపెనీ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. అధికారిక ధృవీకరణ వచ్చే వరకు దీన్ని పూర్తిగా డిస్కంటిన్యూ చేశారని చెప్పడం తొందరపాటు అవుతుంది.

అయితే 49 యూనిట్ల అమ్మకాలు, నెలల తరబడి నమోదుకాని విక్రయాలు, అప్‌డేట్‌ లేకపోవడం చూస్తే ఈ మోడల్‌ ప్రయాణం ముగిసే దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.

ADVERTISEMENT