
MG cars: ఎంజీ మోటార్ నుండి రెండు కొత్త కార్లు.. ఓ మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్
ఈ వార్తాకథనం ఏంటి
మీరు త్వరలో కొత్త ప్రీమియం కారును కొనుగోలు చేయాలని భావిస్తే, మీకు శుభవార్త. ఎంజీ మోటార్ ఈ ఏడాది అనేక కొత్త ప్రీమియం మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
రాబోయే మోడళ్లలో ఎంజీ ఎం9, మెజెస్టర్ కార్లు ఉన్నాయి.
ఎంజీ ఎం9ను కంపెనీ ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది.
ఇప్పటికే ఈ కారుకు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రాబోయే రెండు మోడళ్ల ఫీచర్లను తెలుసుకుందాం.
Details
ఎంజీ ఎం9 ఫీచర్లు
ఎంజీ ఎం9లో ఎలక్ట్రిక్‌గా స్లైడ్ అయ్యే రియర్ డోర్లు, పవర్ టెయిల్ గేట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
అలాగే, మసాజ్, మెమొరీ, వెంటిలేషన్, పవర్ అడ్జస్ట్ మెంట్ ఫంక్షన్స్‌తో ఉన్న ఫస్ట్, సెకండ్ లైన్ సీట్లు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.
ఇంకా 64-కలర్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ ఆటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ కలెక్షన్ వార్నింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఎంజీ ఎం9 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
Details
ఎంజీ మెజెస్టర్ వివరాలు
దీన్ని కిలోవాట్ (ఏసీ) ఛార్జర్ ద్వారా లేదా 150 కిలోవాట్ల (డీసీ) ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. డబ్ల్యూఎల్టిపి ప్రమాణాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ సుమారు 430 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని నివేదికలు వెల్లడించాయి.
ఇక మోస్ట్ అవైటెడ్ ఎంజీ మెజెస్టర్‌ను కూడా ఈ ఏడాది విడుదల చేసే అవకాశముంది. డిజైన్ పరంగా, ఈ ఎస్‌యూవీ పెద్ద చతురస్రాకార రేడియేటర్ గ్రిల్, ముదురు స్కిడ్ ప్లేట్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి
Details
త్వరలో లాంచ్ అయ్యే అవకాశం
. పవర్‌పుల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో ఈ ఎస్‌యూవీ వస్తుంది.
ఇది గరిష్ఠంగా 159 బిహెచ్‌పీ పవర్, 373.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, ఆన్-డిమాండ్ 4డబ్ల్యూడీ సిస్టమ్ ద్వారా మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనుంది.
ఈ మోడల్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.