LOADING...
Uber: పాన్‌లో 'ఉబెర్ డ్రిఫ్ట్' ప్రారంభం.. JDM కార్లలో రియల్ డ్రిఫ్టింగ్ అనుభవం
పాన్‌లో 'ఉబెర్ డ్రిఫ్ట్' ప్రారంభం.. JDM కార్లలో రియల్ డ్రిఫ్టింగ్ అనుభవం

Uber: పాన్‌లో 'ఉబెర్ డ్రిఫ్ట్' ప్రారంభం.. JDM కార్లలో రియల్ డ్రిఫ్టింగ్ అనుభవం

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌లో కార్ల కల్చర్‌ను దగ్గరగా అనుభవించాలని భావించే టూరిస్టులకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్ కొత్త సర్‌ప్రైజ్ ఇచ్చింది. 'ఉబెర్ డ్రిఫ్ట్' పేరుతో ప్రత్యేక సేవను టోక్యోలో ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా ప్రయాణికులు ప్రొఫెషనల్ డ్రైవర్లతో కలిసి జపాన్‌కు చెందిన ప్రసిద్ధ JDM కార్లలో డ్రిఫ్టింగ్ అనుభవాన్ని పొందొచ్చు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సేవను మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రిఫ్టింగ్ అంటే కారును వేగంగా మలుపుల్లో సైడ్‌గా స్కిడ్ అయ్యేలా నడపడం. 1970లలో జపాన్‌లో ప్రారంభమైన ఈ డ్రైవింగ్ స్టైల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కార్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ అనుభవాన్ని సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఉబెర్ ఈ కొత్త సేవను తీసుకొచ్చింది.

వివరాలు 

ట్రాక్‌పైనే భద్రతా నిబంధనల మధ్య నిర్వహించే కార్యక్రమం

'ఉబెర్ డ్రిఫ్ట్' హాఫ్-డే ట్రిప్‌గా ఉంటుంది. టోక్యోలోని హోటల్ లేదా వసతి ప్రాంతం నుంచి ప్రయాణికులను Uber Black వాన్‌లో తీసుకెళ్తారు. అక్కడి నుంచి ప్రముఖ మోటార్‌స్పోర్ట్స్ ట్రాక్ అయిన Mobara Twin Circuit కు తరలిస్తారు. అక్కడ సుమారు 90 నిమిషాల పాటు డ్రైవింగ్, డ్రిఫ్ట్ రైడ్ సెషన్లు నిర్వహిస్తారు. డ్రిఫ్టింగ్ కోసం ఫార్ములా డ్రిఫ్ట్ లైసెన్స్ కలిగిన ప్రొఫెషనల్ డ్రైవర్లను ఉబెర్ ఎంపిక చేసింది. ప్రయాణికులు ప్యాసింజర్ సీట్‌లో కూర్చుంటారు. డ్రైవర్లు ప్రత్యేకంగా సిద్ధం చేసిన Nissan Silvia S15, Nissan 180SX వంటి కార్లలో టాండమ్ డ్రిఫ్ట్ సెషన్లు నిర్వహిస్తారు. ఇది ఓపెన్ రోడ్ ఈవెంట్ కాదు.. ట్రాక్‌పైనే భద్రతా నిబంధనల మధ్య నిర్వహించే కార్యక్రమం.

వివరాలు 

ఒకరి నుంచి నలుగురు వరకు గ్రూప్‌గా బుకింగ్‌ చేసుకోవచ్చు

ఈ బుకింగ్‌ను ఒకరి నుంచి నలుగురు వరకు గ్రూప్‌గా చేసుకోవచ్చు. ఒక్క గ్రూప్‌కు 30,000 జపాన్ యెన్ ధర నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.18 వేల వరకు ఉంటుంది. ఒకరైనా, నలుగురైనా ఛార్జీ మాత్రం ఒకటే. రోజుకు కేవలం నాలుగు గ్రూపులకు మాత్రమే అవకాశం ఉంటుంది. డ్రిఫ్ట్‌లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఫుల్ స్లీవ్స్ దుస్తులు, పూర్తి ప్యాంట్, క్లోజ్డ్ షూస్ ధరించాలి. హెల్మెట్లను ఉబెర్ అందిస్తుంది. బుకింగ్‌లు మే 27, 2026 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 3 నుంచి జూలై 1 వరకు ఈ అనుభవం అందుబాటులో ఉంటుంది.

Advertisement

వివరాలు 

జపాన్ కార్ కల్చర్‌ను ప్రపంచ టూరిస్టులకు మరింత దగ్గర చేయనున్న 'Uber Drift'

బుకింగ్ చేయాలంటే ఉబెర్ యాప్ ఓపెన్ చేసి 'Uber Drift' ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. తర్వాత తేదీ, టైమ్, పాల్గొనేవారి సంఖ్య ఎంపిక చేసి పికప్, డ్రాప్ వివరాలు నమోదు చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈమెయిల్ ద్వారా పూర్తి వివరాలు పంపిస్తారు. ఇప్పటికే ఉబెర్ 'Uber Safari', 'Uber Balloon', 'Uber Bubbles' వంటి ప్రత్యేక టూరిజం అనుభవాలను తీసుకొచ్చింది. ఇప్పుడు 'Uber Drift' ద్వారా జపాన్ కార్ కల్చర్‌ను ప్రపంచ టూరిస్టులకు మరింత దగ్గర చేస్తోంది.

Advertisement