Page Loader
అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. రూ.25 కోట్లు పైమాటే!
అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. రూ.25 కోట్లు పైమాటే!

అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. రూ.25 కోట్లు పైమాటే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే. తాజాగా ఆ సంస్థ ఆ వెహికల్ సంబంధించి కొన్ని విషయాలను ప్రకటించింది. మాంటెరీ కార్ వీక్‌లో జరిగిన "ది క్వాయిల్" ఈవెంట్‌లో మొదటిసారిగా ఈ మోడల్‌ను పరిచయం చేసింది. అల్ట్రా-రేర్ మోడల్ ఉత్పత్తి కేవలం 12 యూనిట్లకు పరిమితం చేశారు. ఇందులో హైపర్‌కార్‌లో కార్బన్ ఫైబర్ ఛాసిస్, అల్కాంటారా అప్హోల్స్టరీని ఉపయోగించారు. హెన్నెస్సీ ఎఫ్5 రివల్యూషన్ రోడ్‌స్టర్‌‌లో 6.6-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, వి8 ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 1,817హెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది.

Details

మైఖేల్ జోర్డాన్ ఈ కారుని కొనుగోలు చేసినట్లు పుకార్లు

అదేవిధంగా దృఢత్వం కోసం కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఛాసిస్‌ను కలిగి ఉంది. ప్రీమియం అల్కాంటారా అప్హోల్స్టరీతో కూడిన స్పోర్టీ టూ-సీటర్ క్యాబిన్ ను ప్రత్యేకంగా అమర్చారు. ఈ వెహికల్ విభిన్నమైన రంగులు, ట్రిమ్ కాంబినేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ హైపర్‌కార్ ధర రూ. $3 మిలియన్లు (దాదాపు రూ. 24 కోట్లు) ఉంది. ఇప్పటికే 12 యూనిట్లు అమ్ముపోవడం విశేషం. NBA లెజెండ్ మైఖేల్ జోర్డాన్ మొదటగా ఈ కారుని కొనుగోలు చేశారని పుకార్లు వ్యాపించాయి.