Page Loader
క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే!
క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే!

క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రేటా, అల్కజార్‌లో కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. ఈ రెండు వాహనాల అడ్వెంచర్ ఎడిషన్‌ల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ఈ కొత్త ఎడిషన్​లో బ్లాక్​డ్​- ఔట్​ స్కిడ్​ ప్లేట్స్​, సైడ్​ సిల్స్​, గ్రిల్​, ఓఆర్​వీఎంలు, షార్క్​ ఫిన్​ యాంటీనా, రూఫ్​ రెయిల్స్​, అలాయ్​ వీల్స్​ వంటివి రానున్నాయి. ఫ్రెంట్​ ఫెండర్​పై "అడ్వెంచర్​" ఎంబ్లమ్​, ఇక రేర్​లో డార్క్​ క్రోమ్​ ఫినీష్​తో కూడిన హ్యుందాయ్​ లోగో ఉంటుంది. ఈ రెండు కార్లూ చాలా ఆకర్షణీయమైన పెయింట్ ఆప్షన్లతో పాటు, ఇంటీరియర్ డిజైన్ కూడా అదిరిపోయింది.

Details

అల్కాజార్ అడ్వెంచర్ ధర రూ.15.17 లక్షలు

అడ్వెంచర్ ఎడిషన్ అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, రేంజర్ ఖాకీ రంగులలో లభించనుంది. మూడు డ్యూయల్-టోన్ రంగులు - అట్లాస్ వైట్, రేంజర్ ఖాకీ, టైటాన్ గ్రేతో ఉన్నాయి. అన్నీ అబిస్ బ్లాక్ రూఫ్‌తో ఉన్నాయి. హ్యుందాయ్​ అల్కజార్​ అడ్వెంచర్​ ఎడిషన్​లో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి. 6 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ టార్క్​ కన్వర్టర్​ ఆటోమెటిక్​, 7 స్పీడ్​ డీసీటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​తో ఈ మోడల్‌ను​ అకర్షణీయంగా రూపొందించారు. అల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ.15.17 లక్షలు ఉండగా... క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.04 లక్షలు ఉంది.