LOADING...
Ultraviolette X-47 :అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ బైక్ లాంచ్.. ధర రూ. 2.74 లక్షలు.. ఫీచర్లు అదుర్స్ 
అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ బైక్ లాంచ్.. ధర రూ. 2.74 లక్షలు..

Ultraviolette X-47 :అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ బైక్ లాంచ్.. ధర రూ. 2.74 లక్షలు.. ఫీచర్లు అదుర్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పై డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ అవకాశాన్ని పరిగణలోకి తీసుకుని, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ "అల్ట్రావైలెట్ ఆటోమోటివ్" కొత్త ఎలక్ట్రిక్ బైక్ అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ ను పరిచయం చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹2.74 లక్షలు కాగా, తొలి 1,000 బైక్ బుకింగ్‌లకు ప్రత్యేకంగా ₹2.49 లక్షల ప్రారంభ ధరలో అందుబాటులో ఉంచింది. బైక్ బుకింగ్‌లు సెప్టెంబర్ 23, 2025 నుంచి ప్రారంభమయ్యి, డెలివరీలు అక్టోబర్ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.

వివరాలు 

అడ్వెంచర్ టూరర్, స్ట్రీట్‌ఫైటర్ కలయిక 

ఎక్స్47 క్రాసోవర్ మూడు ఆకర్షణీయ రంగులలో లభిస్తుంది.లేజర్ రెడ్, ఎయిర్‌స్ట్రైక్ వైట్, షాడో బ్లాక్. దీని డిజైన్‌లో అడ్వెంచర్ టూరర్, స్ట్రీట్‌ఫైటర్ శైలీల కలయిక కనిపిస్తుంది. F77 ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించబడిన ఈ బైక్ కొత్త ఛాసిస్, సబ్‌ఫ్రేమ్‌ తో ప్రత్యేకత పొందింది. దూకుడైన రూపానికి బీక్-స్టైల్ ఫెండర్, ప్రత్యేకమైన ట్యాంక్ డిజైన్, అల్యూమినియం సబ్‌ఫ్రేమ్‌తో కూడిన టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. స్టాండర్డ్ వెర్షన్‌కు తోడు,ఒక ప్రత్యేక ఎడిషన్ డెసర్ట్ వింగ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌లో వెనుక లగేజ్ ర్యాక్,శాడిల్ స్టేలు, సాఫ్ట్ లేదా హార్డ్ పానియర్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా వస్తాయి. ఎక్స్47 క్రాసోవర్‌లో ఉండే 5 ముఖ్య ఫీచర్లు.

వివరాలు 

1. యూవీ హైపర్‌సెన్స్ రాడార్ (UV Hypersense radar)

ఈ బైక్‌లోని ప్రధాన ఫీచర్లలో ఇది ఒకటి. ఈ ఆధునిక సెన్సార్ టెక్నాలజీ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్-చేంజ్ అసిస్ట్, ఓవర్‌టేక్ అలర్ట్, వెనుక నుంచి వచ్చే ప్రమాదాలను హెచ్చరించడం వంటి భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఇది రైడర్ భద్రతను గణనీయంగా పెంచుతుంది. 2. డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ కెమెరాలు ఎక్స్47 క్రాసోవర్‌లో ముందు, వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. ఇవి డ్యాష్‌క్యామ్‌లుగా పనిచేస్తాయి. ఈ కెమెరా సిస్టమ్ ఆప్షనల్ డ్యూయల్ డిస్‌ప్లేతో అనుసంధానం అయ్యి, ముందు మరియు వెనుక కెమెరాల లైవ్ ఫీడ్‌ను రైడర్‌కు అందిస్తుంది.

వివరాలు 

3. ట్రాక్షన్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్ & డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ 

ఈ బైక్ మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్,తొమ్మిది స్థాయిల బ్రేక్ రీజెనరేషన్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ తో వస్తుంది. ఇవి రైడింగ్ సామర్థ్యాన్ని పెంచి,రైడర్ భద్రతను మరింత మెరుగుపరుస్తాయి. 4. శక్తివంతమైన పనితీరు ఎక్స్47 క్రాసోవర్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది.7.1 kWh, 10.3 kWh.ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 40 బీహెచ్‌పీ శక్తి, 100 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.చిన్న బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌లో 211కి.మీ రేంజ్ ఇవ్వగా,పెద్ద ప్యాక్ 323కి.మీ వరకు రైడ్ సపోర్ట్ చేస్తుంది. 5. అద్భుతమైన వేగ సామర్థ్యం అల్ట్రావైలెట్ ఎక్స్47 క్రాసోవర్ 0-60కి.మీ వేగం కేవలం 2.7సెకన్లలో చేరుతుంది. 0-100కి.మీ వేగానికి 8.1 సెకన్లు మాత్రమే పడుతుంది. దీని గరిష్ట వేగం 145 కి.మీ/గంట.