Loading...
Ultraviolette X-47 Venom: అల్ట్రావయొలెట్ X-47 వెనం... మైండ్‌ బ్లోయింగ్‌ మైలేజ్
అల్ట్రావయొలెట్ X-47 వెనం... మైండ్‌ బ్లోయింగ్‌ మైలేజ్

Ultraviolette X-47 Venom: అల్ట్రావయొలెట్ X-47 వెనం... మైండ్‌ బ్లోయింగ్‌ మైలేజ్

వ్రాసిన వారు Balachander Sharma
Oct 23, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునేవారికి ఎక్కువ దూరం ప్రయాణించే రేంజ్‌తో పాటు వేగం, భద్రత కూడా ముఖ్యమే. ఈ మూడు అంశాలపై దృష్టి పెట్టి అల్ట్రావయొలెట్‌ తన కొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ X-47 వెనంను భారత మార్కెట్లో విడుదల చేసింది. పెద్ద బ్యాటరీతో వచ్చే మోడల్‌ ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే గరిష్ఠంగా 343 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్లి తిరిగి రావడానికి ఈ రేంజ్‌ ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే వాస్తవ రేంజ్‌ రైడింగ్‌ వేగం, రహదారి పరిస్థితులు, వాతావరణంపై ఆధారపడి మారుతుంది.

Details

ధర ఎంతంటే?

మొదటి 5,000 యూనిట్లకు పరిచయ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించారు.

ఆ తర్వాత ప్రారంభ ధర రూ.3 లక్షలు. అక్టోబర్‌ 22 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్‌ 2026లో మొదలుకానున్నాయి.

Details

కొత్త ప్లాట్‌ఫామ్‌తో తక్కువ బరువు

ఈ బైక్‌ కొత్త VX-100 100V ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. దీని బరువు 180 కిలోలు.

గత మోడల్‌తో పోలిస్తే 20 కిలోల వరకు తక్కువ. బ్యాటరీ ప్యాక్‌ కూడా 15 శాతం తేలికగా ఉండటంతో పాటు, ఎనర్జీ డెన్సిటీ 25 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది.

ADVERTISEMENT

Details

వేగం, బ్యాటరీ వివరాలు

X-47 వెనం 7 kWh, 11 kWh బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. పెద్ద 11 kWh బ్యాటరీతో 343 కిలోమీటర్ల IDC రేంజ్‌ ప్రకటించారు.

మోటార్‌ గరిష్ఠ శక్తి 30 kW కాగా, చక్రం వద్ద 550 Nm టార్క్‌ లభిస్తుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని 2.7 సెకన్లలో, 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. గరిష్ఠ వేగం గంటకు 155 కిలోమీటర్లు.

ADVERTISEMENT

Details

భద్రతకు ప్రత్యేక ఫీచర్లు

77 GHz రియర్‌ రాడార్‌తో పనిచేసే Hypersense వ్యవస్థ వెనుక నుంచి వచ్చే వాహనాలను 200 మీటర్ల వరకు పర్యవేక్షిస్తుందని కంపెనీ పేర్కొంది.

బ్లైండ్‌ స్పాట్‌ హెచ్చరికలు, లేన్‌ మార్పు సహాయం, వెనుక ప్రమాద హెచ్చరికలు ఇందులో ఉన్నాయి.

7 అంగుళాల టచ్‌స్క్రీన్‌, నావిగేషన్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, వెనుక కెమెరా పార్క్‌ అసిస్ట్‌ కూడా అందించారు.

మొత్తంగా చూసుకుంటే... ఎక్కువ రేంజ్‌, వేగం, ఆధునిక భద్రతా ఫీచర్లు కోరుకునేవారిని X-47 వెనం ఆకర్షించవచ్చు.

ADVERTISEMENT