Tata cars: టాటా కార్ల కొనుగోళ్లపై రూ.70వేల వరకు తగ్గింపు
టాటా మోటార్స్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రెండు సీఎన్‌జీ కార్లను విడుదల చేసింది. అందులో ఒకటి టియాగో ఐసీఎన్‌జీ కాగా.. రెండోది టిగోర్ ఐసీఎన్‌జీ. ఇప్పుడు కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ రెండు కార్లపై రూ. 75,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ. 60,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కారు డ్యూయల్ సీఎన్‌జీ సెటప్ వేరియంట్‌పై రూ. 50,000 వరకు తగ్గింపు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఉన్నాయి.
టియాగో, టిగోర్ ఐసీఎన్‌జీల విడుదల
టియాగో, టిగోర్ మోడల్స్‌లో టాటా మోటార్స్ కంపెనీ ICNG వేరియంట్‌లను కూడా విడుదల చేసింది. వీటిలో టియాగో ఐసీఎన్‌జీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.89 లక్షలు కాగా, టిగోర్ ఐసీఎన్‌జీ ధర రూ.8.84 లక్షలుగా ఉంది. ఈ రెండు కార్ల మైలేజ్ 28 కి.మీ కంటే ఎక్కువ అని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రంగులతో పాటు, టాటా మోటార్స్ కొత్త టోర్నాడో బ్లూలో టియాగో ఐసీఎన్‌జీని, గ్రాస్‌ల్యాండ్ బీజ్‌లో టియాగో ఎన్‌ఆర్‌జీ, మెటోర్ బ్రాంజ్ కలర్‌లో టిగోర్‌ను పరిచయం చేయబోతోంది. టాటా టియాగో, టిగోర్ సిఎన్‌జిలకు ఇప్పటికే మార్కెట్‌లో బలమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రెండింటి ఐసీఎన్‌జీ వేరియంట్ల అమ్మకాలపై కూడా వాటి ప్రభావం పడే అవకాశం ఉంది.