Upcoming cars in July : జులైలో కార్ల సందడి.. రెనాల్ట్ నుంచి ఎంజీ వరకు ఏ మోడల్ ఎప్పుడు వస్తుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆటో మొబైల్ రంగంలో జూన్ నెల కొత్త మోడళ్ల సందడితో ముగిసింది. అప్‌డేటెడ్ టయోటా ఇన్నోవా క్రిస్టా, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్, మారుతీ వ్యాగన్‌ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వంటి వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు 2026 రెండోార్థానికి శ్రీకారం చుడుతూ జులై నెల కూడా అదే ఊపును కొనసాగించనుంది. ఈ నెలలో పలు కొత్త కార్లు భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వాటి విశేషాలు ఇవే..
వివరాలు
2026 రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్ తేదీ: జులై 3
మారుతీ సుజుకీ ఆల్టో కే10కు ప్రత్యర్థిగా నిలిచిన రెనాల్ట్ క్విడ్ తొలిసారిగా 2015లో విడుదలైంది. అనంతరం 2019లో ఒకసారి ఫేస్‌లిఫ్ట్ పొందింది. ప్రస్తుతం ఉన్న మోడల్ దాదాపు ఏడేళ్లుగా విక్రయాల్లో ఉండటంతో దీనికి మరోసారి కొత్త రూపాన్ని అందిస్తోంది కంపెనీ. జులై 3న విడుదల కానున్న కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డస్టర్ తరహాలో 'వై' ఆకారంలోని ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త బంపర్లు, కొత్త టెయిల్‌లైట్లు అందించనున్నారు. భద్రత పరంగా స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మార్పులు ఉండనున్నాయి. పవర్‌ట్రైన్‌లో మాత్రం ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించనున్నారు.
వివరాలు
నిస్సాన్ టెక్టాన్.. డెబ్యూ తేదీ: జులై 9
ప్రస్తుతం ఈ కారు ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డస్టర్ ఆధారంగా రూపొందుతున్న నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ల ప్రకారం ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు,ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, సి-షేప్ టెయిల్‌లైట్లు ఉండనున్నాయి. ఈ ఎస్‌యూవీలో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ కాగా, మరొకటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. రెండు ఇంజిన్లకూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించనుండగా, 1.3 లీటర్ ఇంజిన్‌కు అదనంగా 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంటుంది.
వివరాలు
జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ కొత్త ఎస్‌యూవీ.. డెబ్యూ తేదీ: జులై 16
ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.18.69 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. వూలింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ భారత మార్కెట్ కోసం కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఈ మోడల్ డిజైన్ పేటెంట్‌ను ఇప్పటికే మార్చిలో దాఖలు చేసింది. సుమారు 4,745 మిల్లీమీటర్ల పొడవున్నఈ ఎస్‌యూవీలో 12.8 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మోడల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తోంది.
వివరాలు
జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ కొత్త ఎస్‌యూవీ.. డెబ్యూ తేదీ: జులై 16
హైబ్రిడ్ మోడల్ ఒకసారి పూర్తి ఛార్జ్, పూర్తి ట్యాంక్‌తో 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటోంది. అయితే భారత మార్కెట్లో ఏ పవర్‌ట్రైన్ అందుబాటులోకి వస్తుందనే విషయం జులై 16న స్పష్టత రానుంది. ఈ మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ, టాటా సఫారీ వంటి వాహనాలకు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశముంది.
వివరాలు
మారుతీ సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్.. డెబ్యూ తేదీ: జులై 23
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటైన మారుతీ సుజుకీ బ్రెజ్జా కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జులై 23న పరిచయం కానుంది. ఈ మోడల్‌లో కొత్త బంపర్లు,రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌తో పాటు 9 ఇంచుల స్క్రీన్ స్థానంలో 10.1 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించనున్నారు. సీఎన్జీ వెర్షన్‌లో బూట్ స్పేస్ పెంచేందుకు విక్టోరిస్ తరహా అండర్‌బాడీ ట్యాంక్ సెటప్ ఇచ్చే అవకాశముంది. అయితే ప్రధాన మార్పు ఇంజిన్ విభాగంలో కనిపించనుంది. బ్రెజ్జా చరిత్రలో తొలిసారిగా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ బూస్టర్‌జెట్ ఇంజిన్‌ను అందించనున్నట్లు సమాచారం. చిన్న టర్బో ఇంజిన్ కారణంగా వర్తించే జీఎస్టీ 40 శాతం నుంచి 18 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
వివరాలు
మరిన్ని కార్లు కూడా సిద్ధమే
దీంతో టర్బో వేరియంట్ ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై మోడళ్లతో పాటు 2026 టయోటా హీలక్స్, హోండా జెడ్‌ఆర్-వీ, స్కోడా కొడియాక్ ఆర్‌ఎస్ వంటి మోడళ్లు కూడా జులై నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. అయితే వీటి అధికారిక విడుదల తేదీలను ఆయా సంస్థలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.