
Delhi: ఢిల్లీ ట్రాఫిక్ నియమాల ప్రకారం.. వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారంగా,వాహనంపై ఉపయోగిస్తున్న ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను వాహనాలపై తప్పనిసరిగా అతికించాల్సిందే.
ఈ విధానాన్ని పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణా శాఖ హెచ్చరించింది.
వాహన చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే, మోటార్ వాహన చట్టం కింద రూ. 5000 జరిమానా విధించే అవకాశం ఉంది.
ఈ రంగు స్టిక్కర్లు మొదటిసారిగా 2012-13 సంవత్సరాలలో ప్రవేశపెట్టిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP)లో భాగంగా అందుబాటులోకి వచ్చాయి.
అనంతరం, 2019 నాటికి అన్ని వాహనాలపై ఈ స్టిక్కర్లు ఉండటం తప్పనిసరి అని ఢిల్లీ రవాణా శాఖ స్పష్టం చేసింది.
వివరాలు
రంగు స్టిక్కర్లు అతికించకపోతే జరిమానా
వాహనదారులు ఈ రంగు స్టిక్కర్లను వాహనాలపై అతికించకపోతే, వారు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
అంతేకాక, పోల్ల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUCC) పొందే హక్కును కోల్పోతారు.
నిబంధనల ప్రకారం, డీజిల్ వాహనాలపై నారింజ రంగు స్టిక్కర్లు, పెట్రోల్, సీఎన్‌జీ వాహనాలపై లేత నీలం రంగు స్టిక్కర్లు, మిగతా వాహనాలపై బూడిద రంగు స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.