
VinFast: భారత్‌లో విన్‌ఫాస్ట్ సరికొత్త రికార్డు.. తొమ్మిది నెలల్లోనే లక్షకు పైగా వాహనాల విక్రయం
ఈ వార్తాకథనం ఏంటి
వియత్నాంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత ఆటో మొబైల్ రంగంలో చరిత్ర సృష్టించింది. కేవలం 9 నెలల్లో లక్షకు పైగా కార్లను విక్రయించడం ద్వారా ఈ సంస్థ సంచలనాన్ని సృష్టించింది. ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లోనే ఈ కిరీటాన్ని సాధించిన మొదటి కార్ల బ్రాండ్‌గా విన్‌ఫాస్ట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. మొత్తం అమ్మకాలు,రికార్డులు విన్‌ఫాస్ట్ సెప్టెంబర్ నెలలో 13,914 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది, దీనివల్ల ఈ ఏడాది మొత్తం అమ్మకాలు 1,03,884 యూనిట్లకు చేరాయి. కంపెనీ ప్రకటన ప్రకారం, ఇది భారత ఆటోమొబైల్ చరిత్రలో ఒక ప్రత్యేక రికార్డు. గత 11 నెలలుగా, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో విన్‌ఫాస్ట్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వివరాలు
భారత మార్కెట్‌లో విస్తరణ
భారత మార్కెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న విన్‌ఫాస్ట్, తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా, తమిళనాడులోని తూత్తుకుడి లో ఒక పెద్ద అసెంబ్లీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లో దశలవారీగా రూ. 16,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ప్రథమ దశలో, ఏటా 50,000 ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడళ్లు వీఎఫ్ 6, వీఎఫ్ 7 లను అసెంబుల్ చేయనున్నారు. వినియోగదారులకు కృతజ్ఞతలు విన్‌ఫాస్ట్ గ్లోబల్ డిప్యూటీ సీఈఓ (సేల్స్ అండ్ మార్కెటింగ్) డ్యూంగ్ థీ థు ట్రాంగ్ మాట్లాడుతూ, "మాపై నమ్మకం ఉంచిన వినియోగదారులకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారికి మరింత విలువైన సేవలు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము" అని తెలిపారు.
వివరాలు
ప్రధాన మోడళ్ల విక్రయాలు
కంపెనీ వీఎఫ్ 3 మోడల్ 31,386 యూనిట్లతో అత్యధికంగా అమ్మకాల్లో ముందుండగా, తర్వాతి స్థానాల్లో వీఎఫ్ 5 (30,956 యూనిట్లు) వీఎఫ్ 6 (14,425 యూనిట్లు) ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు దేశవ్యాప్తంగా తన ఉనికిని మరింత పటిష్టం చేసుకోవడానికి, ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్‌షిప్‌లు ప్రారంభించాలనే లక్ష్యాన్ని విన్‌ఫాస్ట్ పెట్టుకుంది.