LOADING...
Vingroup: 'ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్' పథకం.. భారత్ సహా నాలుగు దేశాల్లో వింగ్రూప్ ప్రారంభం
భారత్ సహా నాలుగు దేశాల్లో వింగ్రూప్ ప్రారంభం

Vingroup: 'ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్' పథకం.. భారత్ సహా నాలుగు దేశాల్లో వింగ్రూప్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ వింగ్రూప్ (Vingroup) తమ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ విన్‌ఫాస్ట్ (VinFast) కార్లపై కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. "ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్"అనే పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారేందుకు వినియోగదారులను ప్రోత్సహించనుంది. ఈ పథకాన్ని ఒకేసారి వియత్నాం,భారత్,ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాల్లో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రకారం,తమ పాత పెట్రోల్ వాహనాలను ఇచ్చి కొత్త విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. కార్లు కొనుగోలు చేసే వారికి అదనంగా 3 శాతం డిస్కౌంట్,ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకునేవారికి 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా లేకపోవడం నేపథ్యంలో ఈ నిర్ణయం

ఈ రాయితీలు ఇప్పటికే ఉన్న ఆఫర్లపై అదనంగా వర్తిస్తాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మరింత సులభంగా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా లేకపోవడం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. స్థిరమైన,పర్యావరణ హితమైన రవాణా పరిష్కారాల్లో ముందంజలో ఉండాలని వింగ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో సంస్థకు చెందిన మొబిలిటీ విభాగం జీఎస్‌ఎమ్ గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ (GSM Green and Smart Mobility) తమ ఎలక్ట్రిక్ రైడ్ హైలింగ్ సేవలపై కూడా ధరలను తగ్గించింది. మార్చి 11 నుంచి మార్చి 31, 2026 వరకు వియత్నాంలోని Xanh SM,ఇండోనేషియాలోని Green SM సేవలను ఉపయోగించే వినియోగదారులకు 10 శాతం చార్జీల తగ్గింపు ఇవ్వనున్నారు.

వివరాలు 

వినియోగదారులపై ఉండే ఆర్థిక భారం తగ్గించడంపైనా సంస్థ దృష్టి

ఈ నిర్ణయం ద్వారా ఎలక్ట్రిక్ రవాణా మరింత చవకగా మారడమే కాకుండా, పర్యావరణహిత ప్రయాణ విధానాలను విస్తరించాలనే సంస్థ లక్ష్యాన్ని కూడా స్పష్టంగా చూపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పరిస్థితులను బట్టి మరింత కాలం కొనసాగించే అవకాశం కూడా ఉందని సంస్థ తెలిపింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల పరిస్థితులపై ఆధారపడి ఈ పథకాన్ని పొడిగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. వినియోగదారులకు నేరుగా డిస్కౌంట్లు ఇవ్వడంతో పాటు, షేర్డ్ మొబిలిటీ సేవల నిర్వహణ ఖర్చులను తగ్గించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచాలని వింగ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వినియోగదారులపై ఉండే ఆర్థిక భారం తగ్గించడంపైనా సంస్థ దృష్టి పెట్టింది.

Advertisement

వివరాలు 

ఇతర ప్రోత్సాహక పథకాలతో కలిపి అమలు

ఫాసిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి,శుభ్రమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం ద్వారా వ్యక్తిగత,షేర్డ్ మొబిలిటీకి ఒక సుస్థిర వ్యవస్థను నిర్మించాలనే సంస్థ దీర్ఘకాలిక లక్ష్యంగా పేర్కొంది. ప్రత్యేకంగా ప్రకటించిన "ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్" కార్యక్రమాన్ని ప్రతి దేశంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఇతర ప్రోత్సాహక పథకాలతో కలిపి అమలు చేయనున్నారు. ఇలా పలు రకాల రాయితీలను కలిపి ఇవ్వడం ద్వారా వినియోగదారులు త్వరగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారేందుకు అనుకూల పరిస్థితులు కల్పించాలనేది వింగ్రూప్ లక్ష్యం. దీనివల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గి, ప్రజల రోజువారీ ఖర్చులు స్థిరపడటంతో పాటు, శుభ్రమైన, మెరుగైన జీవన వాతావరణం ఏర్పడుతుందని సంస్థ తెలిపింది.

Advertisement

వివరాలు 

అనేక దేశాల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ప్రభావం

ఈ సందర్భంగా విన్‌ఫాస్ట్ గ్లోబల్ సేల్స్ డిప్యూటీ సీఈఓ డుయాంగ్ థి థు ట్రాంగ్ మాట్లాడుతూ... "మార్చి నెలలో నాలుగు కీలక మార్కెట్లలో ప్రారంభించిన 'ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్' కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న జియోపాలిటికల్ పరిస్థితులకు విన్‌ఫాస్ట్ ఇచ్చిన సమయోచిత స్పందన. ఈ పరిస్థితులు అనేక దేశాల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి ముందుండే సంస్థగా విన్‌ఫాస్ట్, వింగ్రూప్ గ్రీన్ ఎకోసిస్టమ్‌లోని ఇతర కంపెనీలతో కలిసి ప్రజల రోజువారీ జీవితంపై ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా స్మార్ట్, సుస్థిర,తక్కువ ఖర్చుతో కూడిన మొబిలిటీ పరిష్కారాలను అందించాలనుకుంటున్నాం" అని తెలిపారు.

Advertisement