LOADING...
Volvo Buses: ప్రయాణికులకు డబుల్ కంఫర్ట్.. వోల్వో 9600 సీటర్-స్లీపర్ బస్సు ఆవిష్కరణ
ప్రయాణికులకు డబుల్ కంఫర్ట్.. వోల్వో 9600 సీటర్-స్లీపర్ బస్సు ఆవిష్కరణ

Volvo Buses: ప్రయాణికులకు డబుల్ కంఫర్ట్.. వోల్వో 9600 సీటర్-స్లీపర్ బస్సు ఆవిష్కరణ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 10, 2026
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో సుదూర ప్రయాణాల కోసం ప్రీమియం బస్సుల విభాగాన్ని మరింత విస్తరించే దిశగా వోల్వో బస్సెస్ ఇండియా తన ప్రముఖ 9600 కోచ్ మోడల్‌కు తొలిసారిగా ఫ్యాక్టరీలోనే తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ సీటర్-స్లీపర్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త బస్సును గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన ప్రవాస్ 5.0 (Prawaas 5.0) రవాణా సదస్సులో ప్రదర్శించింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర, అంతరనగర ప్రయాణాలు నిర్వహించే బస్సు ఆపరేటర్లు, టూరిజం సంస్థలు, అలాగే తీర్థయాత్రల కోసం సేవలు అందించే సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని రూపొందించింది.

వివరాలు

నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన డిజైన్..

వోల్వో బస్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, 9600 కోచ్‌లో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ (OE) స్థాయిలో తయారైన తొలి సీటర్-స్లీపర్ వేరియంట్ ఇదే. ఇప్పటివరకు మార్కెట్లో సాధారణంగా బస్సులను కొనుగోలు చేసిన తర్వాత బయట సంస్థల ద్వారా సీటర్-స్లీపర్‌గా మార్పులు చేసే విధానం ఉండేది. అయితే ఈ కొత్త మోడల్‌ను నేరుగా ఫ్యాక్టరీలోనే సమగ్రంగా తయారు చేయడం వల్ల నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్, ఏకరీతి నిర్మాణం, ప్రయాణికుల సౌకర్యం మరింత మెరుగ్గా ఉండేలా కంపెనీ రూపొందించింది. ప్రీమియం ప్రయాణ సేవలు అందించే ఫ్లీట్ యజమానులకు ఇది ప్రత్యేక ప్రయోజనం కలిగించనుంది.

వివరాలు

శక్తివంతమైన డీజిల్ ఇంజిన్..

ఈ 15 మీటర్ల పొడవు గల మల్టీ-యాక్సిల్ కోచ్‌లో వోల్వోకు చెందిన శక్తివంతమైన VEDX8 డీజిల్ ఇంజిన్ అమర్చారు. దీనికి సంస్థ అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ I-షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడింది. ఈ కలయిక వల్ల సాఫీ డ్రైవింగ్‌తో పాటు మెరుగైన పనితీరు, ఇంధన వినియోగ సామర్థ్యం లభించే అవకాశం ఉంది. ప్రయాణికుల సామర్థ్యం విషయానికి వస్తే, ఈ కోచ్‌లో మొత్తం 51 మంది ప్రయాణించవచ్చు. ఇందులో పైభాగంలో 24 స్లీపర్ బెర్త్‌లు, వెనుక భాగంలో మూడు దిగువ స్లీపర్ బెర్త్‌లు, అదనంగా కాల్ఫ్ సపోర్ట్‌తో కూడిన 27 ప్రీమియంలోయర్-డెక్ సీట్లు ఏర్పాటు చేశారు. రాత్రి ప్రయాణాల్లో కొందరు విశ్రాంతి తీసుకోవాలనుకునే వారు, మరికొందరు కూర్చునే ప్రయాణాన్ని ఇష్టపడే వారిద్దరికీ డిజైన్ అనువుగా ఉంటుంది.

Advertisement

వివరాలు

అద్భుతమైన ఫీచర్లు..

ప్రయాణికుల సామాను కోసం బస్సు దిగువ భాగంలో 6 క్యూబిక్ మీటర్ల లగేజ్ స్పేస్ కల్పించారు. ఎక్కువ సామానుతో ప్రయాణించే మార్గాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇందులో కిచెనెట్తో పాటు మూసివేసిన ఆన్‌బోర్డ్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో దీర్ఘకాలిక ప్రయాణాల్లో ప్రయాణికులకు అదనపు సౌకర్యం లభిస్తుంది. క్యాబిన్‌లో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచేందుకు అనేక ఆధునిక సదుపాయాలు కల్పించారు. మూడ్ లైటింగ్, వ్యక్తిగత గోప్యత కోసం ప్రైవసీ పార్టిషన్‌లు, ప్రతి ప్రయాణికుడికి చార్జింగ్ పాయింట్లు, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ఇంటిగ్రేషన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అమర్చినప్పటికీ బస్సు లోపలి భాగం ఇరుకుగా అనిపించకుండా సమతుల్యమైన డిజైన్‌ను పాటించారు.

Advertisement

వివరాలు

కనెక్టెడ్ టెలీమాటిక్స్ సిస్టమ్..

భద్రత విషయంలో కూడా ఈ కోచ్‌కు అత్యాధునిక సాంకేతికతను జోడించింది. సాధారణ రియర్ వ్యూ మిర్రర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ కెమెరా మానిటర్ మిర్రర్ వ్యవస్థను అమర్చారు. దీని వల్ల వివిధ వాతావరణ పరిస్థితుల్లో డ్రైవర్‌కు మెరుగైన విజిబిలిటీ లభిస్తుంది. అదనంగా 360 డిగ్రీల కెమెరా సిస్టమ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ స్టేట్ మానిటరింగ్, అలాగే ఆల్కహాల్ ఇంటర్‌లాక్ మాడ్యూల్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫ్లీట్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ బస్సులో కనెక్టెడ్ టెలీమాటిక్స్ సిస్టమ్ను కూడా వోల్వో అందించింది.

వివరాలు

ప్రయాణికులు కోరుకునే సౌకర్యం, భద్రత..

దీని ద్వారా బస్సు ప్రస్తుత లొకేషన్, వేగం, ఇంధన వినియోగ సామర్థ్యం, అలాగే డయాగ్నస్టిక్ అలర్ట్‌లు వంటి వివరాలను రియల్‌టైమ్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రూట్ల నిర్వహణ, వాహనాల పర్యవేక్షణ, నిర్వహణ ఖర్చుల నియంత్రణ మరింత సులభం అవుతుంది. ఈ కొత్త 9600 సీటర్-స్లీపర్ వేరియంట్ ద్వారా ప్రీమియం అంతరనగర రవాణా రంగంలో వేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా వోల్వో బస్సెస్ ఇండియా మరో కీలక ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. నేటి ప్రయాణికులు కోరుకునే సౌకర్యం, భద్రత, ఆధునిక సాంకేతికత, నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలను సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త కోచ్‌ను కంపెనీ రూపొందించింది.

Advertisement