
ADAS: ఏడీఎస్ అంటే ఏమిటి? ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ పూర్తి వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
నేటి ఆటోమోటివ్ పరిశ్రమలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) గురించి చర్చలు విస్తరిస్తున్నాయి. గతంలో ప్రీమియం, లగ్జరీ కార్లకే పరిమితం అయిన ఈ ఫీచర్లు ఇప్పుడు మధ్యశ్రేణి మరియు కొన్ని ఎంట్రీ-లెవెల్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రతి మోడల్‌లో అడాస్ ప్రామాణికంగా ఉండకపోయినప్పటికీ, తయారీదారులు ప్రత్యేక ట్రిమ్‌లలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు. ఉదాహరణకు, టాటా నెక్సాన్ ఇటీవల లెవెల్ 2 అడాస్‌తో అప్‌డేట్ అయింది. అలాగే త్వరలో రాబోయే హ్యుందాయ్ వెన్యూ నెక్ట్స్ జెనరేషన్ మోడల్‌లో లెవెల్ 1 సూట్‌ను లెవెల్ 2కి అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ సిస్టమ్‌లో అడ్డంకులు దాటడం, పాదచారులను గుర్తించడం, లేన్-కీపింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Details
ఆటోమేషన్ లెవెల్స్ (SAE వర్గీకరణ)
ఇలాంటి అడాస్ ఫీచర్లు ఎన్‌సీఏపీ (New Car Assessment Programme) వంటి భద్రతా సంస్థల నుంచి అధిక రేటింగ్ పొందడానికి ముఖ్యంగా అవసరమైపోతున్నాయి. ఇవి కార్లతోపాటు, అల్ట్రావయోలెట్ ఎక్స్47 వంటి కొన్ని మోటార్‌సైకిళ్లలో కూడా ప్రవేశించాయి. కొనుగోలుదారులకు అడాస్ సౌకర్యం భద్రతను పెంచుతుందని అర్థమవుతూనే ఉన్నా, లెవెల్స్, వర్గీకరణ స్పష్టంగా తెలుసుకోవడం అవసరం. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్లు (SAE) డ్రైవింగ్ ఆటోమేషన్‌ను 0 నుంచి 5 వరకు ఆరు స్థాయిలుగా వర్గీకరించారు. ఈ లెవెల్స్ వాహనం డ్రైవర్ బాధ్యతను ఎంత మేరకు అవసరమయ్యేదో చూపిస్తాయి.
Details
లెవెల్ 0: ఆటోమేషన్ లేదు
డ్రైవర్ పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఫార్వర్డ్ కొలిజన్ హెచ్చరికలు, లేన్ డిపార్చర్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉండవచ్చు, కానీ వాహనం స్వయంచాలకంగా కంట్రోల్ అవ్వదు. క్రూయిజ్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఇందులో వస్తాయి. లెవెల్ 1: డ్రైవర్ సహాయం డ్రైవర్ పూర్తి నియంత్రణలో ఉండాలి, కానీ వాహనం స్టీరింగ్ లేదా యాక్సలరేషన్/బ్రేక్‌లో ఒక అంశంలో మాత్రమే సహాయం అందిస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లేదా లేన్ కీపింగ్ అసిస్ట్ లాంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.
Details
లెవెల్ 2: పాక్షిక ఆటోమేషన్
కారు నిర్దిష్ట పరిస్థితులలో స్టీర్, యాక్సలరేట్, బ్రేక్ చేయగలదు. లేన్ సెంటరింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కలిసి పనిచేస్తాయి. డ్రైవర్ రోడ్డుపై దృష్టి ఉంచి అవసరమైతే జోక్యం చేసుకోవాలి. భారతదేశంలోని ఆధునిక వాహనాలు ఎక్కువగా లెవెల్ 2లో ఉన్నాయి. లెవెల్ 3: షరతులతో కూడిన ఆటోమేషన్ హైవే క్రూయిజింగ్ వంటి నిర్దిష్ట సందర్భాల్లో కారు అన్ని డ్రైవింగ్ ఫంక్షన్లను నిర్వహించగలదు. డ్రైవర్ రోడ్డుపై దృష్టి మరల్చవచ్చు, కానీ కొన్ని సెకన్లలో జోక్యం చేయడం అవసరం. లెవెల్ 3 అడాస్ చాలా సున్నితమైనది, ప్రపంచంలో కొద్ది వాహనాలకే ఇది అందుబాటులో ఉంది.
Details
లెవెల్ 4 & 5: అధిక- పూర్తి ఆటోమేషన్
లెవెల్ 4 వాహనాలు నిర్దిష్ట ప్రాంతాల్లో అన్ని డ్రైవింగ్ పనులను స్వయంచాలకంగా నిర్వహిస్తాయి (నగరాలు, క్యాంపస్). వేమో వంటి రోబోటాక్సీలు ఈ స్థాయిలో ఉన్నాయి. లెవెల్ 5లో డ్రైవర్ జోక్యం అవసరం ఉండదు. స్టీరింగ్ వీల్, పెడల్స్ అవసరం లేకుండా అన్ని పరిస్థితుల్లో పూర్తి ఆటోమేషన్ సాధ్యం. కానీ ఇప్పటివరకు ఎలాంటి వాహనం ఈ స్థాయిలోకి రాలేదు. కొనుగోలుదారులకు ముఖ్యం ఎందుకు? హ్యుందాయ్, హోండా, మహీంద్రా,ఎంజీ వంటి కంపెనీల అధునిక వాహనాలు లెవెల్ 2 అడాస్‌తో వస్తున్నాయి. ఇవి సౌకర్యవంతంగా, భద్రతను పెంచే విధంగా ఉంటాయి, కానీ డ్రైవర్ నిరంతర పర్యవేక్షణ అవసరం.లెవెల్ 3 అడాస్ ఉన్న కార్లు కఠినంగా, ప్రయోగాత్మకంగా పనిచేస్తాయి, కాబట్టి వాహనం, డ్రైవర్ మధ్య సమతుల్యం తెలిసి ఉండాలి.