
Cars Recall : 51 మిలియన్ కార్లను రీకాల్ చేయనున్న బడా కంపెనీలు
ఈ వార్తాకథనం ఏంటి
బీఎండబ్య్లూ, ఫోర్డ్, Volkswagen, General Motors (GM) కార్లలో ఎయిర్‌బ్యాగ్ లోపం కారణంగా USలో దాదాపు 51 మిలియన్ వాహనాలను రీకాల్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.
ఈ మేరకు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్, ఆటోమోటివ్ ఇంక్, డెల్ఫీ ఆటోమోటివ్ సిస్టమ్స్ LLC నుండి ఇన్‌ఫ్లేటర్‌ల గురించి హెచ్చరికను జారీ చేసింది.
ఈ సమస్య వల్ల ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు పేలడానికి కారణమవుతాయని పేర్కొన్నారు.
కొన్ని ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్‌లు తగినంత వెల్డ్‌లను కలిగి ఉండవని, దీని వల్ల అధిక ఒత్తిడి గురవుతాయని వెల్లడించింది.
Details
30 గడువు ఇచ్చిన ఎన్‌హెచ్‌టీఎస్ఎ
సెప్టెంబరు 2023లో, NHTSA ARC ఆటోమోటివ్, డెల్ఫీ ఆటోమోటివ్ సిస్టమ్‌లను రీకాల్ చేయమని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ARC ఆటోమోటివ్ ఈ సిఫార్సుకు అనుగుణంగా లేదు. NHTSA ప్రస్తుతం ఈ విస్తృతమైన భద్రతా సమస్య మధ్య డెల్ఫీ ఉత్పత్తులకు ఎవరు బాధ్యత వహించాలో నిర్ణయిస్తోంది.
NHTSA ఈ సమస్యపై అన్ని వాహన తయారీదారులకు, సరఫరాదారులకు 30 రోజుల సమయం ఇచ్చింది.
GM ఇప్పటికే ప్రమాదకరమైన ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్‌లుగా భావించే దాదాపు ఒక మిలియన్ కార్లకు రీకాల్ నోటీసును జారీ చేసింది.