EV battery: MG బ్యాటరీతో విండ్సర్ EV బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?
MG మోటార్స్ తన విండ్సర్ EV బ్యాటరీ ధరను ప్రకటించింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే 3 ట్రిమ్‌లలో లభించనుంది. వీటి బుకింగ్స్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. కార్‌మేకర్ విండ్సర్ యజమానులకు జీవితకాల బ్యాటరీ వారంటీని, పబ్లిక్ ఛార్జర్‌లపై ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ అందించనుంది. అదే విధంగా 3 సంవత్సరాలు 45,000 కిమీల తర్వాత 60 శాతం బైబ్యాక్‌ను కూడా అందిస్తుంది. సెప్టెంబరు 11న, విండ్సర్ ధరను అద్దెకు బ్యాటరీ తీసుకునే సదుపాయాన్ని ప్రకటించింది.
వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
విండ్సర్ సెగ్మెంట్‌లో అతిపెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో అమర్చారు. MG విండ్సర్ EV ఏరోగ్లైడ్ డిజైన్‌లో పరిచయం చేశారు. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో క్రాస్‌ఓవర్ బాడీస్టైల్‌ను కలిగి ఉంది. అదనంగా, ఫ్లష్ డోర్-హ్యాండిల్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ప్రింటెడ్ యాంటెన్నా, ఆటో వైపర్, వెనుక డీఫాగర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ కారులో 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 256-కలర్ అడ్జస్టబుల్ యాంబియంట్ లైటింగ్, బూట్‌లో సబ్ వూఫర్, ముందు, వెనుక ఆర్మ్‌రెస్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
30 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్
విండ్సర్ 38kWh బ్యాటరీ ప్యాక్‌తో ప్రారంభించారు. ఇది మోటారుతో కలిసి 134bhp శక్తిని, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో, బ్యాటరీని 30 నిమిషాల్లో 30 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీతో కూడిన దాని ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 13.49 లక్షలు, ఎక్స్‌క్లూజివ్ రూ. 14.5 లక్షలు, ఎసెన్స్ రూ. 15.49 లక్షలగా నిర్ణయించారు.