
VinFast: విన్‌ఫాస్ట్ సంచలనం.. భారత మార్కెట్‌కి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు!
ఈ వార్తాకథనం ఏంటి
వియత్నాం ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తన మోడళ్లను ప్రదర్శించిన ఈ కంపెనీ, ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది చివరికి వీఎఫ్7 (VF7), వీఎఫ్6 (VF6) మోడళ్లను లాంచ్ చేయనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ నెల నుంచే వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని వెల్లడించింది.
Details
భారతీయులకు అనుగుణంగా డిజైన్
వియత్నాంలో డిజైన్ చేస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. అంతేకాదు, భారత్‌లోని తమిళనాడులో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఇది త్వరలో అందుబాటులోకి రానుందని, ప్రారంభ దశలోనే ఈ ప్లాంట్ ఏడాదికి 50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వెల్లడించారు. ఈ ప్లాంట్ ద్వారా VF7, VF6 కార్ల అసెంబ్లింగ్ జరగనుంది.
Details
VF7: ప్రీమియం ఎలక్ట్రిక్ SUV
వీఎఫ్7 మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో పోటీపడే ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. వీ-థీమ్ డిజైన్: LED DRLs, స్ప్లిట్ హెడ్‌లాంప్స్, బంపర్‌పై సిల్వర్ గార్నిష్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, 4.5 మీటర్ల పొడవు, కూపే రూఫ్‌లైన్ ఇంజిన్ ఆప్షన్లు VF7 ప్లస్ సింగిల్ మోటార్: 201 bhp పవర్, 310 Nm టార్క్ VF7 AWD డ్యూయల్ మోటార్: 343 bhp పవర్, 500 Nm టార్క్ బ్యాటరీ: 75.3 కిలోవాట్, ఒకసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల WLTP రేంజ్ ఫీచర్లు: లెథరెట్ అప్‌హోల్‌స్టరీ, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ADAS
Details
VF6: కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV
VF6 మోడల్ VF7 కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది. పొడవు: 4.2 మీటర్లు సెగ్మెంట్: హ్యుందాయ్ క్రెటా EV, టాటా కర్వ్ EV, మహీంద్రా XUV400 ఇంజిన్ ఆప్షన్లు VF6 ప్లస్: 201 bhp పవర్, 310 Nm టార్క్ VF6 ఈకో: 172 bhp పవర్, 250 Nm టార్క్ బ్యాటరీ: 59.6 కిలోవాట్ VF6 ఈకో రేంజ్: 399 కిలోమీటర్లు VF6 ప్లస్ రేంజ్: 381 కిలోమీటర్లు
Details
టెక్నాలజీ, ఇంటీరియర్‌లు
VF7, VF6 రెండింటిలోనూ 12.6 అంగుళాల టచ్ స్క్రీన్ మినిమలిస్ట్ డాష్‌బోర్డ్, హెడ్ అప్ డిస్‌ప్లే (HUD), ట్రాడిషనల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లేకుండా డిజైన్ లెవల్ 2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, స్వదేశీ UI/UX ఉండనున్నాయి భారీగా పెట్టుబడి భారత్‌లో తన ఉనికిని బలంగా నిలబెట్టుకోవడానికి విన్‌ఫాస్ట్ దాదాపు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. తయారీ ప్లాంట్‌తో పాటు దేశవ్యాప్తంగా డీలర్ నెట్‌వర్క్ ఏర్పాటుపై పనిచేస్తోంది. పండుగ సీజన్ నాటికి మార్కెట్లో ఉత్సాహభరిత లాంచ్ కోసం కసరత్తు జరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఈవీలను పరిచయం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.