
Xiaomi EV: డిసెంబర్ 28న షావోమి ఈవీ కారు లాంచ్.. ఎలా ఉందో చూశారా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తమ తొలి కారును త్వరలో తీసుకొస్తున్నట్లు తెలిసిందే.
అయితే దీనిపై ఆ కంపెనీ సీఈఓ లీ జూన్ స్పందించాడు.
డిసెంబర్ 28న షావోమీ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ వెహికల్‌కి ప్రస్తుతం Weiboలో 68,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ
వాహనం కోసం 3400 కంటే ఎక్కువ ఇంజనీర్లు పనిచేసినట్లు తెలిసింది.
షావోమీ ఎలక్ట్రిక్ వాహనాలపై 2023లోనే ప్రకటన వచ్చింది.
అయితే స్వీయ డ్రైవింగ్ సామర్థ్యం కోసం LiDAR సాంకేతికతను ఉపయోగించినట్లు సమాచారం.
Details
మూడు వేరియంట్లలో రానున్న షావోమీ ఈవీ కారు
షావోమి ఈవీలో మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యాల కోసం LiDAR టెక్నాలజీ, B-పిల్లర్ కెమెరా ద్వారా ఫేస్-రికగ్నిషన్ అన్‌లాకింగ్‌ను చేర్చినట్లు వెల్లడించింది.
ఈ కారు పొడవు 4,997ఎమ్ఎమ్, వెడల్పు 1,963ఎమ్ఎమ్, పొడవు 1,455ఎమ్ఎమ్ ఉంది. ఇది 3,000mm వీల్ బేస్ కలిగి ఉంటుంది.
Xiaomi EV వరుసగా 220kW, 449kW మోటార్‌ల ద్వారా రియర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
ఈ కారు SU7, SU7 ప్రో, SU7 మ్యాక్స్ వేరియంట్లలో రానుంది.
'ఫేస్ రికగ్నిషన్ అన్‌లాకింగ్' ఫీచర్ ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు