LOADING...
Yamaha R15,R3: రెట్రో రేసింగ్ స్టైల్‌తో అదిరిపోయిన యమహా R15,R3
రెట్రో రేసింగ్ స్టైల్‌తో అదిరిపోయిన యమహా R15,R3

Yamaha R15,R3: రెట్రో రేసింగ్ స్టైల్‌తో అదిరిపోయిన యమహా R15,R3

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ తన రేసింగ్ చరిత్రకు గుర్తుగా బ్రెజిల్ మార్కెట్‌లో ప్రత్యేక 70వ వార్షికోత్సవ ఎడిషన్లను విడుదల చేసింది. ఇందులో Yamaha R15, Yamaha R3 బైక్‌లకు కొత్త రెట్రో రేసింగ్ థీమ్‌తో డిజైన్ అప్‌డేట్స్ ఇచ్చింది. 1960, 1970 దశకాల్లో యమహా రేసింగ్ బైక్‌లకు ఉపయోగించిన వైట్-రెడ్ కలర్ కాంబినేషన్‌ను ఈ కొత్త మోడళ్లలో తీసుకొచ్చింది. అలాగే 'స్పీడ్ బ్లాక్' గ్రాఫిక్స్‌ను కూడా జోడించింది. ఫ్యూయల్ ట్యాంక్‌, ఫెయిరింగ్‌, విండ్స్‌క్రీన్ ప్రాంతాల్లో రెడ్ హైలైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్యాంక్‌పై 70th Anniversary బ్యాడ్జ్‌ను కూడా అమర్చింది.

వివరాలు 

8.5 hp పవర్‌,14.7 Nmటార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

ఈ ప్రత్యేక ఎడిషన్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. బ్రెజిల్ మార్కెట్ కోసం Yamaha R15 Anniversary Editionను కేవలం 1,200 యూనిట్లు,Yamaha R3 Anniversary Editionను 600 యూనిట్ల వరకే తయారు చేయనుంది. డిజైన్ మార్పులు తప్ప మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు.Yamaha R15లో అదే 155cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ VVA ఇంజిన్ కొనసాగుతుంది. ఇది సుమారు 18.5 hp పవర్‌,14.7 Nmటార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు Yamaha R3లో 321cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉండగా,ఇది 40hp కంటే ఎక్కువ పవర్‌ను అందిస్తుంది. రెండు బైక్‌ల్లోనూ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌, డ్యూయల్ ఛానల్ ABS,అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్‌,డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌,స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.

Advertisement