LOADING...
 XSR 155 vs Enfield Hunter 350: యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 వర్సెస్ హంటర్ 350.. నియో-రెట్రో బైక్‌లో ఏది బెస్ట్?  
యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 వర్సెస్ హంటర్ 350.. నియో-రెట్రో బైక్‌లో ఏది బెస్ట్?

 XSR 155 vs Enfield Hunter 350: యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 వర్సెస్ హంటర్ 350.. నియో-రెట్రో బైక్‌లో ఏది బెస్ట్?  

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155' ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ నియో-రెట్రో బైక్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ బైక్ నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో పోటీకి దిగుతోంది. రెండూ రెట్రో-మోడర్న్ ఫ్యూజన్ డిజైన్‌ను అందించినప్పటికీ, ధరలు, ఇంజిన్ సామర్థ్యం, ఫీచర్ల విషయంలో మాత్రం గణనీయమైన తేడాలు ఉన్నాయి. ఏది మీ అవసరాలకు బెస్ట్‌గా సరిపోతుందో తెలుసుకోవడానికి ఈ పోలిక మీకు ఉపయోగపడుతుంది.

Details

 ఇంజిన్ స్పెసిఫికేషన్‌ల పోలిక 

యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 ఇంజిన్: 155cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ షేర్: R15 మరియు MT-15 మోడళ్లలో ఉపయోగించే అదే ఇంజిన్ పవర్: 10,000 RPM వద్ద 18.4 HP * టార్క్: 7,500 RPM వద్ద 14.1 Nm గేర్‌బాక్స్: 6-స్పీడ్ * సాఫ్ట్, రెస్పాన్సివ్ పనితీరుకు ఈ ఇంజిన్ ప్రసిద్ధి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (2025 మోడల్) ఇంజిన్: 349cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్, J-సిరీస్ పవర్: 20.2 BHP * టార్క్: 27 Nm * గేర్‌బాక్స్: 5-స్పీడ్ స్పష్టంగా పవర్, టార్క్ అవుట్‌పుట్‌లలో హంటర్ 350 ఎక్స్‌ఎస్‌ఆర్ కంటే ముందుంది.

Details

ధరల పోలిక 

అంటే తక్కువ CC అయినా రిఫైన్డ్ పెర్ఫార్మెన్స్ కోసం ఎక్స్‌ఎస్‌ఆర్ 155 సరిపోతే, పవర్ + టార్క్ కోసం చూసేవారికి హంటర్ 350 బెస్ట్ ఆప్షన్. యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 ధర: రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) పోటీ బైక్: TVS Ronin → రూ. 1.25 లక్షల నుంచి ప్రారంభం రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర: రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్న వేరియంట్లు: 7 కలర్ ఆప్షన్స్ ధర పరంగా చూస్తే హంటర్ 350 కొంచెం చవకగా లభిస్తోంది. అయితే ఎక్స్‌ఎస్‌ఆర్ 155 ప్రీమియం ఫీల్, తేలికైన హ్యాండ్లింగ్, స్పోర్టీ ఇంజిన్ వల్ల యువ రైడర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది.