డిసెంబర్ లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు: తగ్గింపులే కారణం
భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల (PVS) రిటైల్ విక్రయాలు డిసెంబరులో రికార్డును తాకనున్నాయి. సంవత్సరాంతపు తగ్గింపులు వలన భారీగా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్‌లో ప్రయాణీకుల వాహనాల రిటైలింగ్ భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో 400,000 మార్కును తాకే అవకాశం ఉంది. ఇక్కడ కస్టమర్‌లకు సాధారణంగా క్యాలెండర్ సంవత్సరం చివరి నెలలో కార్లను కొనుగోలు చేయడానికి తగ్గింపులు అవసరం. డిసెంబర్ 2018లో, ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 382.000 యూనిట్లు అమ్ముడుపోయాయి, ఇది ఇప్పటి వరకు నెలవారీ రికార్డుగా ఉంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలను ఏప్రిల్ 1న ప్రవేశపెట్టడానికి ముందు ఆటోమొబైల్ డీలర్లు షోరూమ్ స్టాక్‌ను తగ్గించడంలో ఈ తగ్గింపులు సహాయపడుతున్నాయని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
జనవరి నుండి పెరగనున్న ధరలు
"కొన్ని మోడళ్లకు తగ్గింపులను అందించే సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఇది డిసెంబర్ 2022 రిటైల్ PV వాల్యూమ్‌లను అత్యధిక స్థాయికి తీసుకెళ్లవచ్చు" అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఈ అమ్మకాలలో, SUV అమ్మకాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. RDE నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయడం చిన్న డీజిల్ కార్లకు వాణిజ్యపరంగా లాభదాయకం కాదు. అందువల్ల, అనేక కార్ మోడల్‌లు మార్కెట్లో నిలిచిపోనున్నాయి. ఈ కార్ల ధరల తగ్గింపులు ఈ నెల వరకే పరిమితమని జనవరి నెల నుండి ముఖ్యంగా ఎక్సక్లూసివ్ షోరూం ధరలు పెరుగుతాయని తయారీ దారులు అంటున్నారు. ఇప్పటికే తయారీ సంస్థలు RDE నిబంధనలకు అనుగుణముగా కార్ల తయారీకి ఇన్పుట్ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ధరలను పెంచుతామని ప్రకటించాయి.