Yezdi Adventure: కొత్త రంగులు, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యెజ్దీ (Yezdi) భారత మార్కెట్లో తన 2026 మోడల్ లైనప్ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ తాజా శ్రేణిలో యెజ్ది అడ్వెన్చర్, రోస్టర్, స్క్రాబ్లెర్ మోడళ్లకు ఆకర్షణీయమైన కొత్త కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా Yezdi Adventure బైక్‌లో తొలిసారిగా ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్ను అందించడం ఈ లాంచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కేరళలో జరుగుతున్న ఓణం పండుగను పురస్కరించుకుని కంపెనీ ఈ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
వివరాలు
తొలిసారిగా ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్..
2026 యెజ్ది అడ్వెంచర్‌కు ఎల్లో ఫాల్కన్ పేరుతో కొత్త కలర్ వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది.
ఇందులో ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్‌ను అమర్చారు. సంప్రదాయ స్పోక్ వీల్స్‌కు ఉండే బలాన్ని, ట్యూబ్‌లెస్ టైర్ల సౌలభ్యాన్ని కలిపేలా ఈ కొత్త వీల్ సెటప్‌ను రూపొందించారు.
ఈ ఫీచర్‌ను ఎంపిక చేసుకునే వినియోగదారులు స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే రూ.20,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అదనంగా Tornado Black, Gloss White, Nebula Blue రంగుల్లో కూడా ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఆప్షన్‌ను అందిస్తున్నారు.
ఈ అడ్వెంచర్ బైక్‌లో ఇప్పటికే ఉన్న 334సీసీ Alpha2 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్నే కొనసాగించారు.
వివరాలు
Roadster, Scramblerకు కొత్త కలర్స్
Yezdi Roadster కోసం కంపెనీ Green Mamba అనే కొత్త రంగును పరిచయం చేసింది.
మ్యాట్ గ్రీన్ పెయింట్‌తో పాటు Arabica Brown క్విల్టెడ్ సీట్, కాపర్ కలర్ డెకల్స్ ఈ బైక్‌కు మరింత ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చాయి.
ఇందులో 334సీసీ Alpha2 ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ యథాతథంగా కొనసాగుతున్నాయి.
అలాగే Yezdi Scramblerకు Grey Panther కలర్ వేరియంట్‌ను విడుదల చేశారు.
మెటాలిక్ గ్రే పెయింట్ స్కీమ్, బ్రౌన్ రిబ్డ్ సీట్, అదే రంగుకు సరిపోయే ట్యాంక్ ప్యాడ్స్ ఈ బైక్ ప్రత్యేకతలు.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మోడల్ లీటర్ పెట్రోల్‌కు 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
వివరాలు
బుకింగ్స్ ప్రారంభం.. విస్తరణపై కంపెనీ దృష్టి..
2026 Yezdi Adventure, Roadster, Scrambler మోడళ్ల బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇదే సందర్భంగా Classic Legends కేరళ రాష్ట్రంలో ఒకేసారి 20 కొత్త టచ్ పాయింట్లను ప్రారంభించింది.
కంపెనీ లక్ష్యం 2028 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 700 టచ్ పాయింట్లతో తన డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం.